https://oktelugu.com/

Manchu Manoj – Bhuma Mounika : భార్య మౌనికతో పర్సనల్ ఫొటోలు లీక్ చేసిన మంచు మనోజ్

ఈ సందర్భంగా నా భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా మనసు, నా ఆత్మలో నువ్వు నాకు అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను" అని మనోజ్ తన భార్యపై ప్రేమను కురిపించాడు.. దానికి లవ్ సింబల్ జాత చేర్చాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 11:45 am
    Follow us on

    Manchu Manoj – Bhuma Mounika : మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం వారి తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలను అతికొద్ది సన్నిహితుల మధ్య నిర్వహించారు. గత ఏడాది మార్చి మూడున మనోజ్, మౌనిక వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి దగ్గరుండి జరిపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

    మౌనిక, ధైరవ్ తో కలిసి ఉన్న ఫోటోలను మనోజ్ ట్విట్టర్లో షేర్ చేశాడు..”ప్రతిరోజు ప్రేమ, సంతోషం కలబోతతో ఇది అద్భుతమైన ప్రయాణం..ధైరవ్, మనకు త్వరలో కలిగే చిన్నారి కోసం ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెబుతున్నా. నా ప్రియమైన సతీమణి భూమ మౌనికకు మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నీకు నీ తల్లిదండ్రులు లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేను. కాకపోతే వారిలాగా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నానని వాగ్దానం చేస్తున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మిమ్మల్ని నేను రక్షించుకుంటాను. మీతో నాకు అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా మనసు, నా ఆత్మలో నువ్వు నాకు అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను” అని మనోజ్ తన భార్యపై ప్రేమను కురిపించాడు.. దానికి లవ్ సింబల్ జాత చేర్చాడు.

    కాగా, ఇటీవల మౌనిక గర్భం దాల్చింది. ఆ విషయాన్ని మనోజ్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. ఈ ఏడాది మధ్యలో బహుశా వారు తమ బిడ్డకు స్వాగతం పలికే అవకాశం ఉంది. మరోవైపు మౌనిక కూడా సామాజిక మాధ్యమాల వేదిక తన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. మౌనిక తన మెడలో మనోజ్ తాళి కడుతుండగా భావోద్వేగానికి గురైన ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా, ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.