SSMB28 Mahesh Babu Trivikram: ఓ ‘అతడు’తో ఆరంభించాడు.. ఆ తర్వాత ‘ఖలేజా’ చూపించాడు.. ఇప్పుడు ఈ ఇద్దరి ద్వయం మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చిత్రం ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని మహేష్ బాబు 28వ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు తొలి రోజు షూట్ వీడియోను చిత్రం యూనిట్ పంచుకుంది. ఇందులో మహేష్ బాబు గుబురు జుట్టు, కొంచెం లైట్ గడ్డంతో అచ్చం ‘పోకిరీ’ని దింపేశాడు. చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ రఫ్ గా మాస్ మసాలాగా కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.

చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత మహేష్ బాబు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మహేష్-త్రివిక్రమ్ల కలయికలో మళ్లీ కొత్త సినిమా పట్టాలెక్కింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు షూటింగ్ స్పాట్ వీడియోను విడుదల చేయగా వైరల్ అయ్యింది. ఈ మూవీ కూడా మరో ‘అల వైకుంఠపురంలో’ లాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB28 చిత్రం నిస్సందేహంగా అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమనే చెప్పాలి. వీరిద్దరి గత చిత్రాలు ప్రస్తుత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ చిత్రం ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ సినిమా పట్టాలెక్కడానికి ఈ టైం పట్టింది. ఈరోజు చిత్రీకరణ ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్.రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
మేకర్స్ #SSMB28 సెట్స్ నుండి తొలిరోజు షూట్ ప్రారంభాన్ని ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. మహేష్ అభిమానులను ఆనందపరచడానికి మహేష్ మాస్ లుక్ ను ఇందులో సీక్రెట్ గా చూపించారు. మహేష్ బాబు -త్రివిక్రమ్ సెట్స్‌లో సంగీత దర్శకుడు థమన్, నిర్మాతలు ఎస్ రాధా కృష్ణ మరియు నాగ వంశీ మరియు స్టంట్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్‌లతో కలిసి యానిమేషన్ చర్చలో పాల్గొన్నారు.
The filming of an Epic Action Entertainer Begins today!🔥
The blockbuster combo of Superstar @urstrulymahesh & #Trivikram garu on sets after 12 years!! ✨⭐️
SUPERSTAR in a massy rugged avatar 🤩🤩
Await for more surprises coming your way, SOON!! #SSMB28Aarambham #SSMB28 pic.twitter.com/uu1J8L0xd3
— Naga Vamsi (@vamsi84) September 12, 2022
థమన్ ఈ తొలి రోజు షూటింగ్ కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మరింత ఆకర్షణకు దోహదపడింది. వీడియోలో మహేష్ బాబు, నల్ల చొక్కా ధరించి, దర్శకుడు త్రివిక్రమ్ నుండి వచ్చిన అన్ని ఇన్‌పుట్‌లను శ్రద్ధగా వింటూ పాటిస్తున్నాడు. తొలిరోజు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
#SSMB28 ఆరంభం అనే పదాలతో వీడియో ముగుస్తుంది. #SSMB28 అనేది మహేష్ బాబు – త్రివిక్రమ్‌ల మూడవ చిత్రం. అతడు మరియు ఖలేజా చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై బోలెడు అంచనాలున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన & దర్శకత్వం త్రివిక్రమ్ వహిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్ చేస్తుండగా.. ఎడిటర్ నవీన్ నూలి. ఆర్ట్ డైరెక్టర్ – ఎ.ఎస్. ప్రకాష్ సారథ్యంలో సెట్టింగ్ నడుస్తున్నాయి. యాక్షన్ డైరెక్టర్ గా అన్బరివ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్. రాధా కృష్ణ(చినబాబు)
హారిక & హాసిని క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు.