https://oktelugu.com/

Mahashivarathri : ఈ పూలతో పూజ చేస్తే శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు..

ఆ దేవదేవుడికి కొన్ని ఫలాలు, పత్రాలు, పుష్పాలు సమర్పించడం వల్ల అనుకున్నది సాధిస్తారని అంటారు. అయితే ఈ ప్రత్యేక పూలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తారు. వాటిలో..

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2024 / 03:44 PM IST

    mahashivarathri

    Follow us on

    Mahashivarathri :కోరిన వరాలిచ్చే మహాశిశుడు అంటే ప్రతి ఒక్కరినీ ఎనలేని భక్తి. ఆయన అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు మాత్రమే కాకుండా తపస్సులు చేసేవారు ఎందరో ఉన్నారు. అయితే సాధారణ రోజుల్లో కంటే మహాశివరాత్రి రోజు పరమశివుడికి అనుగుణంగా ఉండడం వల్ల అంతా మంచే జరుగుతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటున్నారు. ప్రధానంగా ఈరోజు కొన్ని ప్రత్యేక పూలతో పూజించడం వల్ల శివుడు ఎంతో సంతోషపడుతారని అంటారు. మహాశివుడికి అభిషేక ప్రియుడు. అలంకరణ అంటే ఇష్టం లేకున్నా.. ఆ దేవదేవుడికి కొన్ని ఫలాలు, పత్రాలు, పుష్పాలు సమర్పించడం వల్ల అనుకున్నది సాధిస్తారని అంటారు. అయితే ఈ ప్రత్యేక పూలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తారు. వాటిలో..

    చంప పూలు:
    చంప పూలు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఎక్కువగా సువాసనలు వెదజల్లుతాయి. ఈ పూలతో పూజించడం వల్ల శివుడు ఎంతో సంతోషపడుతాడు.

    అపపరాజిత పూలు:
    ఇవి చూడ్డానికి నీలం రంగులో ఉంటాయి. పాల సముద్రాని చిలికినప్పుడు వచ్చిన విషాన్ని శివుడు దానిని తన కంఠంలో దాచుకుంటాడు. అదే నీలం రంగులో ఈ పుష్పం ఉండడం వల్ల వీటితో పూజిస్తే శివుడి అనుగ్రహం ఉంటుందంటారు.

    కల్కాపూలు:
    ఇవి పసుపు రంగుంలో ఉంటాయి. వీటితో పూజించినా శివుడు ఆనందిస్తాడని అంటారు.

    జిల్లేడు పూలు:
    జిల్లేడు పూలంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఇవి స్వామివారికి ఎంతో ప్రీతి అని చెబుతారు.

    చిన్నమల్లె:
    మల్లె పూవు అంటే ఇష్టముండని వారుండరు. కానీ ఇందులో చిన్న మల్లెలు అంటే శివుడికి అత్యంత ప్రీతికరం. అందువల్ల వీటితో పూజ చేయడం వల్ల శివుడి అనుగ్రహం ఖాయం అని అంటారు.