Tata Motors: టాటా కంపెనీ రెండు ముక్కలు.. షేర్లు కొంటే లాభమా? నష్టమా?

విభజన అనంతరం టాటా మోటార్స్ తన బాటాదారులందరికీ నమోదిత సంస్థలో షేర్లు కేటాయించింది. కేటాయింపు మాత్రమే కాదు మార్కెట్లో ఉన్న అవకాశాలు మొత్తం మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Written By: Suresh, Updated On : March 5, 2024 3:47 pm

Tata Motors

Follow us on

Tata Motors: టాటా కంపెనీ అంటే తెలియని భారతీయుడు ఉండడు. ఆ కంపెనీ తయారుచేసిన వస్తువులను వాడని ఈ వ్యక్తి మనదేశంలో ఉండడు. అంతగా పెనవేసుకుపోయింది ఆ కంపెనీ. టాటా మోటార్స్ (Tata motors) ఆటోమొబైల్ రంగంలో మన దేశంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది. సోమవారం ఈ కంపెనీ రెండు ముక్కలుగా విడిపోయింది. దీనికి కంపెనీ బోర్డ్ కూడా ఆమోదం ప్రకటించింది.. దీంతో టాటా కంపెనీ తన వాహనాలకు సంబంధించి రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించింది. ఈ రెండు రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునేందుకు ఇలా విభజించామని టాటా చెబుతోంది. విభజన తర్వాత టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు ఒక లిస్టెడ్ కంపెనీగా ఏర్పాటయ్యాయి. టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, లాండ్ రోవర్, జాగ్వార్ వంటివి మరో లిస్టెడ్ కంపెనీగా అవతరించాయి.

విభజన అనంతరం టాటా మోటార్స్ తన బాటాదారులందరికీ నమోదిత సంస్థలో షేర్లు కేటాయించింది. కేటాయింపు మాత్రమే కాదు మార్కెట్లో ఉన్న అవకాశాలు మొత్తం మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మార్కెట్ వర్గాల ప్రకారం ఈ విభజనకు వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల అనుమతి లభించేందుకు ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పట్టవచ్చు అని తెలుస్తోంది.

టాటా మోటార్స్ విభజన తర్వాత స్టాక్ మార్కెట్లో షేర్లు పరుగులు పెట్టాయి. ఇప్పటివరకు టాటా మోటార్స్ షేర్ శాతానికి పైగా లాభ పడింది. మంగళవారం మధ్యాహ్నానికి 1,048.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూనే ఉంది. కంపెనీ విభజన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం మంగళవారం మాత్రమే కాదు వచ్చే రోజుల్లో కూడా టాటా మోటార్స్ షేర్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంగళవారం మార్కెట్ ప్రారంభంలో టాటా మోటార్స్ షేర్ విలువ 8 శాతం పెరిగింది. 1,065 వద్ద 52 వారాల గరిష్టానికి చేరుకుంది. దీంతో కంపెనీ విలువ 12,601 కోట్లకు పెరిగి రూ. 3,40,633.29 కోట్లకు చేరుకుంది.. కాగా వాటాదారులందరికీ రెండు నమోదు కంపెనీలో షేర్లు లభిస్తాయని కంపెనీ ప్రకటించడం విశేషం.