దేశంలోని ప్రజలకు కరోనా విజృంభణ వల్ల గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండగా మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి.
Also Read: ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. రూ.2 వేల క్యాష్‌బ్యాక్ పొందే ఛాన్స్..?
సాధారణంగా గ్యాస్ సిలిండర్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు చేస్తాయి. అయితే ఈ నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉండటంతో సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవని భావించారు. అయితే ఊహించని విధంగా సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ పై 25 రూపాయలు పెంచుతూ గ్యాస్ సిలిండర్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also Read: చినిగిపోయిన రూ.2000, రూ.500 నోట్లు ఉన్నాయా.. ఎలా మార్చుకోవాలంటే..?
నేటి నుంచే పెరిగిన ధరలు అమలు కానున్నాయి. గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో సిలిండర్ ధర 746.50 రూపాయలు ఉన్న సిలిండర్ 25 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర 771.50 రూపాయలకు చేరింది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని గ్యాస్ సిలిండర్ వినియోగదారులు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు కేంద్రం గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఎత్తివేయనుందని బడ్జెట్ లో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి నిధులు కేటాయించలేదని ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రం ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు ఇస్తున్న సంగతి తెలిసిందే.