https://oktelugu.com/

శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏవైనా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చేతికి కంకణం ధరిస్తారు. ఈ విధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కంకణం ప్రాధాన్యత ఏమిటి? అలా కంకణం కట్టుకోవడానికి వెనుక ఉన్న గల కారణం ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయినప్పటికీ పూజలు చేసేటప్పుడు కంకణం కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటారు. అయితే కంకణం ఎందుకు కట్టుకుంటారనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2021 / 12:16 PM IST
    Follow us on

    సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏవైనా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చేతికి కంకణం ధరిస్తారు. ఈ విధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కంకణం ప్రాధాన్యత ఏమిటి? అలా కంకణం కట్టుకోవడానికి వెనుక ఉన్న గల కారణం ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయినప్పటికీ పూజలు చేసేటప్పుడు కంకణం కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటారు. అయితే కంకణం ఎందుకు కట్టుకుంటారనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

    Also Read: గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ ధర..?

    ఏవైనా శుభకార్యం చేసేటప్పుడు కంకణం చేతికి ధరిస్తే మనం ఒకే ఆలోచన మీద, ఒకే మాట మీద ధర్మబద్ధంగా నిలబడి ఉన్నామని అర్థం. ఈ చేతి కంకణానికి అధిపతి దేవుడు సుదర్శన భగవానుడు.మనం చేతికి కంకణం కట్టుకోవడం ద్వారా మనం చేసేటటువంటి మంచి పనులు ఆలోచనలను మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే కంకణం మణికట్టుకు కట్టుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మణికట్టుకు కట్టిన కంకణం ద్వారా రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

    Also Read: ఈ ఆంజనేయుడిని గురువారం పూజిస్తే..?

    సాధారణంగా కంకణం కట్టుకునే వారు మూడు పోగుల దారం లేదా ఏడు పోగులు కలిపి దానికి పసుపు కొమ్ము లేదా లేత తమలపాకులు కట్టి మన చేతికి కడతారు. కంకణధారణ చేసేటప్పుడు నిశ్చలమైన మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా చేతికి కంకణం ధరించేటప్పుడు మన చేతిలో కొబ్బరికాయ, లేదా ఏదైనా పండు, పువ్వును చేతపట్టుకొని ఉండాలి. ఈ కంకణాన్ని ధరించేటప్పుడు మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడమ చేతికి ధరించాలి.ఈ విధంగా శుభకార్యాలలో కంకణం ధరించినపుడు మన మనస్సు ఆలోచనలు అన్నీ మనం చేసే పనిపై ధ్యాస చూపెడుతాయి కనుక శుభకార్యాలలో కంకణం కట్టుకుంటారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం