https://oktelugu.com/

గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారా.. సబ్సిడీ ఎలా తెలుసుకోవాలంటే..?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీని ఇస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడీ పంపిణీ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సబ్సిడీ జమవుతోంది. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ లోకి వెళ్లి సబ్సిడీ గ్యాస్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 1800-233-3555 కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి కూడా గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 17, 2021 / 11:06 AM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీని ఇస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడీ పంపిణీ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సబ్సిడీ జమవుతోంది. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ లోకి వెళ్లి సబ్సిడీ గ్యాస్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 1800-233-3555 కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి కూడా గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీరేటులో కోత..?

    సబ్సిడీకి సంబంధించి ప్రజల్లో అపోహలు నెలకొన్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం ద్వారా సులభంగా సబ్సిడీని పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఆఫర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే డిస్కౌంట్ ను పొందవచ్చు. అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వాళ్లకు 50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

    Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మిస్డ్ కాల్ ఇస్తే లోన్..?

    అయితే తొలిసారి అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఆయిల్ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాలను వెల్లడించిది. అమెజాన్ పే ద్వారా ఇండేన్ గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చని తెలిపింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఫిబ్రవరి 15వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా 50 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. రోజురోజుకు సిలిండర్ ధరలు పెరుగుతుండటంపై వినియోగదారుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమానార్హం.