https://oktelugu.com/

Nara Lokesh: లోకేష్ లాంతరు యాత్ర.. జగన్ కు ‘కరెంట్’ షాక్ లా మారిందా?

Nara Lokesh Lantern trip: నవ్యాంధ్రలో విద్యుత్ కాంతులకు బదులుగా ప్రస్తుతం చీకటి రాజ్యమేలుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆర్థిక విధానాలతో ఇప్పటికే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కురుకపోయిన సంగతి అందరికీ తెల్సిందే. దీనికితోడు జగన్ రెడ్డి చేతగాని తనం వల్ల ఏపీలో అప్రకటిత విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఈ కారణంగా నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వేసవి ప్రారంభంలోనే ఏపీలో విద్యుత్ కోతలు ప్రారంభం కావడంతో మున్ముందు ఎలా ఉంటుందనే ఆందోళన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 11:32 am
    Follow us on

    Nara Lokesh Lantern trip: నవ్యాంధ్రలో విద్యుత్ కాంతులకు బదులుగా ప్రస్తుతం చీకటి రాజ్యమేలుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆర్థిక విధానాలతో ఇప్పటికే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కురుకపోయిన సంగతి అందరికీ తెల్సిందే. దీనికితోడు జగన్ రెడ్డి చేతగాని తనం వల్ల ఏపీలో అప్రకటిత విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఈ కారణంగా నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

    వేసవి ప్రారంభంలోనే ఏపీలో విద్యుత్ కోతలు ప్రారంభం కావడంతో మున్ముందు ఎలా ఉంటుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా విద్యుత్ అధికారులు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దీంతో గ్రామాలన్నీ కూడా అంధకారంలోని వెళుతున్నాయి.

    ఏపీలో డిమాండ్ కు తగ్గ సరఫరా కావడం లేదు. ప్రస్తుతం ఏపీలో జెన్‌కోతోపాటు హిందుజా నుంచి వచ్చే థర్మల్‌ విద్యుత్‌తో కలిపి 90.79 ఎంయూలు అందుబాటులో ఉంది. జల విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి 9.5 ఎంయూలు, పవన, సౌర విద్యుత్‌ కలిపి 26 ఎంయూలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నుంచి సుమారు 40ఎంయూల వచ్చినా ఏపీలో డిమాండ్‌ మేర ఇంకా 50 ఎంయూలు డిస్కంలు కొనాల్సి ఉంటుంది.

    ఇందుకు గాను రోజుకు కనీసం రూ.35 కోట్లు అవసరమని అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. అయితే విద్యుత్ ఎక్స్చేంజీల్లో డిమాండ్ భారీగా పెరిగడంతో ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్‌కు ఇక్కడ విద్యుత్‌ దొరకటం లేదని సమాచారం. దీంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి.

    రాత్రి సమయాల్లో విద్యుత్ కోతలతో ఆస్పత్రిల్లోని రోగులు, సామాన్య ప్రజలు ఉక్కపోతతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండటంతో రాత్రిళ్లు వారికి నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల జంగారెడ్డి గూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో కరెంటు లేక బాలింతలు, పసికందులు నానా అవస్థలు పడిన ఘటనలు వెలుగు చూశాయి.

    ఈనేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. ఆ సమయంలో కరెంటు పోవడంతో లోకేష్ లాంతరు పట్టుకొని తన పర్యటనను కొనసాగించారు.

    ఆంధ్రప్రదేశ్ ని అంధకారప్రదేశ్ గా మార్చేశారంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుతూనే మరోపక్క కోతలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి కురగల్లు గ్రామంలో లాంతరు చేతపట్టుకొని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బాదుడే బాదుడు అంటూ ముద్రించిన విసరకర్రలను ఇంటింటికి పంపిణీ చేసిన నిరసన తెలిపారు. విద్యుత్ కోనుగోలు విషయంలో డిస్కంలు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందాయని ఆయన విమర్శలు గుప్పించారు.