Argentina vs Croatia: టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా తన స్థాయి ఆటను ప్రదర్శించింది. చావో రేవో తేలాల్సిన మ్యాచ్లో సమిష్టిగా రాణించి రేవుకే వెళ్ళింది..ఫిఫా కప్ కు అడుగు దూరంలో నిలిచింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత క్రోయేషియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టింది.. మెస్సి ట్రోఫీ కల సాకారం దిశగా అడుగులు వేసింది. సెమీ ఫైనల్ లో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో క్రోయేషియాను 3_0 కోల్స్ తేడాతో అర్జెంటినా ఓడించింది.. ఈ మ్యాచ్లో మెస్సి ఒక గోల్ చేయగా.. అల్వా రేజ్ రెండు గోల్స్ చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి అర్జెంటీనా బంతిని తన నియంత్రణలో ఉంచుకుంది.. ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై పదేపదే దాడి చేసింది.. ఈ ప్రయోగం ఫలించి అర్జెంటీనా మూడు గోల్స్ సాధించేలా చేసింది.

మొదట్లో తడబడినా
సాకర్ బరిలో అర్జెంటుగా జట్టు హాట్ ఫేవరెట్ గా దిగింది.. మొదట్లో కాస్త తడబడింది.. తర్వాత పుంజుకుంది.. వాస్తవానికి గత రెండు ప్రపంచ కప్ ల్లో 2014లో అర్జెంటీనా, 2018లో క్రొయేషియా రన్నరప్ గా నిలిచాయి.. అయితే అర్జెంటీనా 1978, 1986లో సాకర్ కప్ లు గెలుచుకుంది.. అయితే ఇప్పటివరకు సెమిస్ లో అర్జెంటీనాకు ఓటమి అన్నదే లేదు.. అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించింది.
రివెంజ్ తీర్చుకుంది
గత ప్రపంచకప్ గ్రూప్ దశలో క్రొయేషియా 3_0 గోల్స్ తేడాతో అర్జెంటీనా పై గెలిచింది. అయితే అప్పటినుంచి సరైన సమయం కోసం అర్జెంటీనా కాపు కాచుకొని కూర్చుంది. ఈసారి వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ ద్వారా ఆ అవకాశం వచ్చింది.. దీంతో అర్జెంటీనా ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఆడారు. ఎలాగైనా గెలవాలని కసితో మైదానంలో చిరుతపులుల్లా పరిగెత్తారు. బంతిని ప్రత్యర్థి జట్టులో ఆటగాళ్లకు దక్కనియకుండా డ్రంబ్లింగ్ చేశారు.

మాయ చేశారు
ఇప్పటికే సాగర్ స్టార్లు క్రిస్టియనో రొనాల్డో, నెయిమార్ కన్నీళ్లతో టోర్నీ వీడారు. అయితే మెస్సి మాత్రం ఆ పొరపాటు చేయలేదు. తన జట్టును గెలిపించాలనే ఉద్దేశంతోనే కసి తీరా ఆడాడు. అతడికి ఆల్వేరేజ్ తోడు కావడంతో క్రోయేషియా జట్టుపై విరుచుకుపడ్డారు.. మొదటి గోల్ మెస్సి సాధించగా.. ఆల్వే రేజ్ రెండు గోల్స్ సాధించాడు. కానీ అర్జెంటీనా ఆటగాళ్లను నిలువరించడంలో క్రోయేషియా ఆటగాళ్లు తడబడ్డారు. గత పుట్ బాల్ కప్ ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యారు. ఈరోజు అర్ధరాత్రి జరిగే రెండో సెమీస్ లో మొరాకో, ఫ్రాన్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో పోటీపడుతుంది.
మ్యాచ్ హైలెట్స్ ఈ కింది లింకులో చూడగలరు
https://www.youtube.com/watch?v=k6rc4CS1TTA