దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించలేని వారి కోసం మైక్రో ప్లాన్స్ ను అమలు చేస్తోంది. తక్కువ బీమా మొత్తానికి తక్కువ ప్రీమియం చెల్లించి ఈ పాలసీ ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు. ఎల్‌ఐసీ మైక్రో పాలసీల్లో ఒకటైన భాగ్య లక్ష్మీ పాలసీని తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారికి లైఫ్ టైమ్ ఫ్యామిలీ పెన్షన్..?
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ తక్కువ ఆదాయం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీలను అమలు చేస్తోంది. పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తంలో 110 శాతానికి సమానమైన డబ్బును పొందే అవకాశం ఉంటుంది. గడువులోగా పాలసీదారుడు చనిపోతే నామినీ బీమా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ పాలసీలను తీసుకోవచ్చు.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1,300 చెల్లిస్తే లక్షల్లో రాబడి..?
ఈ పాలసీని తీసుకున్న వారు ఐదు సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు పాలసీ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు పాలసీని తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ చెల్లించే ప్రీమియంతో పోలిస్తే రెండు సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 15 సంవత్సరాలకు పాలసీ తీసుకుంటే 13 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
వార్షిక ప్రీమియం దాదాపు 1,200 రూపాయలు కాగా నెలకు 100 రూపాయల చొప్పున ఆదా చేసినా సరిపోతుంది. ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించి పాలసీలను తీసుకోవచ్చు.