Leo Song Badass: “లియో” దాస్..అలియాస్ బ్యాడ్ దాస్.. ఇది లోకేష్ మరణ మాస్

యో సినిమాలో విజయ్ పాత్ర పేరు లియోదాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాత్రల చివర దాస్ అని తగిలించాడు లోకేష్. సంజయ్ దత్, అర్జున్, విజయ్ పాత్రల పేర్లలో చివర దాస్ ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

Written By: Bhaskar, Updated On : September 29, 2023 10:32 am

Leo Song Badass

Follow us on

Leo Song Badass: చిరుత లాంటి చూపు.. చేతిలో ఆయుధాలు.. కళ్ళ ఎదుట కాఫీ గింజలు.. వెంట వస్తున్న వాహనశ్రేణి.. శత్రు దుర్భేద్యం లాంటి కోట.. వీటన్నిటికీ మించేలాగా అనిరుధ్ సంగీతం.. ఇవీ అభిమానుల మీదకు లోకేష్ కనగరాజ్ సంధించిన అస్త్రాలు.. లోకేష్ కనగగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా, సంజయ్ దత్, అర్జున్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న లియో సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ విడుదల అయింది. అనిరుధ్ ఈ పాటలో సరికొత్త పంథాను ఎంచుకున్నాడు. వెస్ట్రన్ బీట్ కలబోతతో దుమ్మురేపాడు.

లియో సినిమాలో విజయ్ పాత్ర పేరు లియోదాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాత్రల చివర దాస్ అని తగిలించాడు లోకేష్. సంజయ్ దత్, అర్జున్, విజయ్ పాత్రల పేర్లలో చివర దాస్ ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. పైగా విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తీస్తున్న సినిమా కావడంతో తమిళ ఇతర పరిశ్రమలోనే కాదు తెలుగులో కూడా బజ్ ఏర్పడింది. ఇక ఈ సెకండ్ సింగిల్ లో లియో దాస్ బ్యాడ్ దాస్ గా ఎలా మారాడు? అతడి ఉద్దేశం ఏమిటి? విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే పాత్రధారికి, లియో దాస్ కు ఉన్న సంబంధం ఏంటి? ఆ స్థాయిలో అతడు కాఫీ గింజల్లో డ్రగ్స్ ఎందుకు తయారు చేస్తున్నాడు? ఈ డ్రగ్స్ ద్వారా అతడు ఎటువంటి లక్ష్యాలు సాధించాలి అనుకుంటున్నాడు? అనే విషయాలను చూచాయగా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశాడు.

ముందుగానే అందరూ అనుకుంటున్నట్టు ఖైదీ సినిమాలోని ఢిల్లీ పాత్ర, విక్రమ్ సినిమాలోని రోలెక్స్, ఇతర పాత్రలతో లియో సినిమాకు సంబంధం ఉందని లోకేష్ ఈ పాట ద్వారా హింట్స్ ఇచ్చాడు. ఈ పాటలో మొదటి చరణంలో రోలెక్స్ పాత్ర కనిపిస్తుంది. అదే సమయంలో లియో దాస్ పాత్ర మరింత భయంకరంగా ఉంటుంది అని లోకేష్ కొంచెం కొంచెం చూపించాడు. దానికి ఈ పాట లోకేష్ మార్క్ మరణ మాస్ లాగా ఉంది. తమిళంలో విడుదలైన ఈ పాట ఇంకా తెలుగు వర్షన్ లో రిలీజ్ కావలసి ఉంది. యూట్యూబ్ లో ఇప్పటికే దీనిని 80 లక్షల మంది చూసేసారు. తమిళంలో ఈ పాటను విష్ణు ఎడవన్ రాశారు. అనిరుధ్ ఆలపించారు.