
K.Viswanath టాలీవుడ్ లో ఒక్కో దిగ్గజం నేలరాలిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికళాతపస్వికీ తెలిసిందే..ఇప్పుడు అకస్మాత్తుగా కళాతపస్వి విశ్వనాథ్ కూడా నేడు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసని విడిచేసాడు..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో మేలిమి ముత్యాలు లాంటి సినిమాలు తీసిన ఆ మహానుభావుడు నేడు మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేనిది..ఆయన తీసినన్ని క్లాసిక్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా తియ్యలేదని చెప్పడం లో ఏమాత్రం అతిశయం లేదు..చిరంజీవి ,కమల్ హాసన్ వంటి నటులు విశ్వనాథ్ గారిని తమ సొంత తండ్రి లాగ భావిస్తారు.
ఆయన చనిపోయాడనే వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ హుటాహుటిన ఆసుపత్రి కి చేరుకున్నారు..అప్పొల్లో హాస్పిటల్స్ అవ్వడం తో ఉపాసన విశ్వనాథ్ గారి ట్రీట్మెంట్ కొరకు ఎంతో ప్రత్యేక శ్రద్ద చూపించారు..కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయన ప్రాణాలను కాపాడలేకపో272345-2యారు..దీనితో చిరంజీవి కుటుంబం తో పాటు విశ్వనాథ్ ని ప్రేమించే ప్రతీ ఒక్కరు శోకసంద్రం లో మునిగిపోయారు..ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ప్రార్థిస్తున్నాము.