Fighting Prank On Sri Satya: బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్య విషయంలో మెహబూబ్, అర్జున్ కళ్యాణ్ గొడవకు దిగారు. వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. శ్రీసత్య అంటే అర్జున్ కళ్యాణ్ కి ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరికి చాలా కాలంగా పరిచయం ఉంది. బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీసత్య-అర్జున్ కళ్యాణ్ పాల్గొన్నారు. అర్జున్ కళ్యాణ్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి శాయశక్తులా కృషి చేశాడు. శ్రీసత్య మాత్రం మనోడిని పట్టించుకోలేదు. అయితే అతడి వీక్నెస్ ని తెలివిగా వాడేసింది. అది తనకు ఫేవర్ అయ్యింది. అర్జున్ కళ్యాణ్ కి మైనస్ అయ్యింది.

దీంతో అర్జున్ కళ్యాణ్ త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుండి వెళ్ళిపోతున్నానన్న బాధ కంటే శ్రీసత్యకు దూరం అవుతున్నందుకు ఎక్కువ ఫీల్ అయ్యాడు. అసలు హౌస్ లోకి వచ్చిందే నీకోసం అంటూ అసలు విషయం బయట పెట్టాడు. చివరికి చిన్నపిల్లాడిలా ఏడ్చాడు కూడాను. అయినా ఆమె గుండె కరగలేదు. షాకింగ్ మేటర్ ఏమిటంటే… అర్జున్ హౌస్లో ఉన్నన్నాళ్లు నాకు ప్రేమలు, రిలేషన్స్ పడవని చెప్పింది. అతడు బయటకు వెళ్లిపోయాక… శ్రీహాన్ కి దగ్గరైంది. ఫ్రెండ్షిప్ పేరుతో సీక్రెట్ రొమాన్స్ చేసింది.
ఇదిలా ఉండగా స్టార్ మాలో బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. ఇది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో జరుగుతున్న షో. అర్జున్ క్రష్ శ్రీసత్య మెహబూబ్ తో జతకట్టింది. ఇక వాసంతి తో అర్జున్ కళ్యాణ్ జోడి కట్టారు. శ్రీసత్య తనకు జోడీగా వస్తే బాగుండేదనే అసహనం అర్జున్ కళ్యాణ్ లో ఉంది. అదే సమయంలో ఆమె జతగాడు మెహబూబ్ పై కోపం ఉంది. ఈ క్రమంలో మెహబూబ్ తో అర్జున్ కళ్యాణ్ గొడవపడ్డారు. బీబీ జోడీ కోసం ప్రాక్టీస్ చేసుకునే ప్లేస్ విషయంలో మెహబూబ్-అర్జున్ కళ్యాణ్ కొట్లాటకు దిగారు.

ఇద్దరూ చొక్కాలు పట్టుకొని నెట్టుకున్నారు. శ్రీసత్య కలుగజేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో మెహబూబ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ఇది నిజమైన గొడవ కాదని, యూట్యూబ్ వ్యూస్, హైప్ కోసం చేసిన డ్రామా అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నారు. బిగ్ బాస్ కారణంగా మెహబూబ్ బాగానే లాభపడ్డాడు.