Homeఆంధ్రప్రదేశ్‌KTR: కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ ఆంధ్రా-తెలంగాణ గొడవ!

KTR: కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ ఆంధ్రా-తెలంగాణ గొడవ!

KTR: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్‌లో నరకంగా పరిస్థితులు ఉన్నాయన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి పదునైన విమర్శలకు దారితీసింది. ఇది క్రమంగా ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్త వివాదానికి దారితీసింది.

పొరుగు తెలుగు రాష్ట్రం గురించి తెలంగాణ మంత్రి మాట్లాడటం తగదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కేటీఆర్‌పై ఘాటుగా మండిపడ్డారు. “సంక్రాంతి సెలవుల కోసం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన తన స్నేహితుడిని ఉటంకిస్తూ, అధ్వాన్నమైన రోడ్లు.. విద్యుత్.. నీటి సరఫరా లేకపోవడంపై కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ బొత్స దీనికి కౌంటర్ ఇచ్చాడు. ‘నేను ఇప్పుడే హైదరాబాద్ నుండి వస్తున్నాను. హైదరాబాద్‌లోని మా ఇంట్లో రెండు రోజులుగా కరెంటు లేదు. మేము జనరేటర్‌ తో ఉండాల్సి వచ్చింది. దీనిపై కేటీఆర్ ఏమంటారు?’ అని బొత్స కూడా ఘాటుగానే ప్రశ్నించాడు.

బొత్స వ్యాఖ్యలపై స్పందించిన చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటికి బొత్స కరెంట్ బిల్లు చెల్లించకపోయి ఉండవచ్చని కౌంటర్ ఇచ్చాడు. అందుకే విద్యుత్ సరఫరా లేదు కావచ్చని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో మేము నిరంతర విద్యుత్ సరఫరాను చేస్తున్నాం” అని ఆయన చెప్పాడు.

కోస్తా ఆంధ్ర ప్రజల చెమట, రక్తంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ గురించి కేటీఆర్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంపై విజయవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు తప్పుబట్టారు. ‘‘తెలంగాణ ప్రజలకు సంస్కృతి నేర్పింది ఆంధ్రా వాళ్లే. వారి పెట్టుబడి వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు కేటీఆర్ విజయవాడకు రావాలి’’ అని ఆయన అన్నారు.

కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే రోజులు వస్తాయని విష్ణు హెచ్చరికలు సైతం చేశాడు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే మళ్లీ ఆంధ్రా తెలంగాణ మధ్య గొడవలకు దారితీస్తున్నాయనే చెప్పొచ్చు.

Recommended Videos
Minister KTR Sensational Comments on AP Roads || Telangana vs AP || Ok Telugu
Construction Workers Comments on CM Jagan Ruling || 3 Years of Jagan Ruling || Ok Telugu
Janasena Leader Jayaram Reddy Counter to CM Jagan || AP Women Protection || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] IPL 2022: ఐపీఎల్ హవా కొనసాగుతోంది. జట్లు పరుగుల వరద పారిస్తున్నాయి. విజయాల యాత్ర కొనసాగిస్తున్నాయి. కొన్ని జట్లు మాత్రం అపజయాలే మూటగట్టుకుంటున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రికార్డులు ఓ సారి పరిశీలిస్తే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల గురించి ఆరా తీస్తే గమ్మత్తైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతవరకు జరిగిన మ్యాచుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్లలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు. […]

  2. […] Minister Roja: పాపం రోజా.. మంత్రి పదవి వచ్చిన కొత్తల్లో కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్‌ అడిగారు. అది ఈరోజు ఫిక్స్‌ అయింది. కానీ ఆమె బ్యాడ్‌ లక్‌ ఏంటంటే.. కేసీఆర్‌ని వెళ్లి కలిసే రోజు.. సరిగ్గా కలిసేలోపే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్‌ మాటల మంటలు రేపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది తెలలియని రోజా.. కేసీఆర్‌ను కలిసిన తర్వాత బాగానే ఇబ్బంది పడ్డారు. ప్రగతి భవన్‌ బయటకొచ్చాక కేటీఆర్‌ని ఏమీ అనలేక, అలాగని ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇవ్వలేక రోజా డైలమాలో పడ్డారు. కేటీఆర్‌ పొరుగు రాష్ట్రాలన్నారు కానీ ఏపీ అనలేదని, ఆయన్ను ఆ స్నేహితుడెవరో తప్పుదోవ పట్టించి ఉంటారని కవర్‌ చేశారు. […]

Comments are closed.

Exit mobile version