spot_img
Homeఎంటర్టైన్మెంట్Krithi Shetty Glamor Secrets: 'కృతి శెట్టి' గ్లామర్ వెనుక ఉన్న బ్యూటీ...

Krithi Shetty Glamor Secrets: ‘కృతి శెట్టి’ గ్లామర్ వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్ ఇవే

Krithi Shetty Glamor Secrets: పాలమీగడ మీద చిక్కని నురుగు లాంటి మేని ఛాయ ఉన్న ‘కృతి శెట్టి’ అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ? అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘కృతి శెట్టి’ చేసే పనులు తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మరి, తన చంద్రకాంతి లాంటి ముఖాన్ని కాపాడుకోవాలంటే ఆ మాత్రం చేయాల్సిందే అంటుంది కృతి శెట్టి. ఇంతకీ, కృతి శెట్టి అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్, ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

‘కృతి శెట్టి’ పాటించే బ్యూటీ సీక్రెట్స్ :

1. డైట్ :

Krithi Shetty Glamor Secrets
Krithi Shetty Glamor Secrets

‘కృతి శెట్టి’ వెజిటేరియన్ డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది. అలాగే ‘కృతి శెట్టి’ కి పెరుగు అంటే చాలా ఇష్టం, తన భోజనంలో ఎప్పుడూ పెరుగు ఉండేలా చూసుకుంటుంది కృతి. పెరుగు తన శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుందని కృతి శెట్టి’ అభిప్రాయం. నిజానికి ‘కృతి శెట్టి’కి చిన్నతనం నుంచీ వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. కానీ, తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం వాటికి చాలా దూరం ఉంటుంది.

Also Read: Madhuri Dixit Marriage: ‘మాధురీ దీక్షిత్’కి పెళ్లి అనగానే ‘దీపికా పదుకోణె’ తండ్రి రూమ్ లోకి వెళ్లి.. ?

2. వాటర్ రూపంలో తాగేవి ఇవే :

Krithi Shetty Glamor Secrets
Krithi Shetty Glamor Secrets

‘కృతి శెట్టి’ తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తీసుకుంటుంది. వీటి వల్ల తన చర్మానికి తగినంత తేమ అందుతుందని, అప్పుడు తన స్కిన్ నిత్యం తాజాగా కనిపిస్తుందని ‘కృతి శెట్టి చెబుతుంది. ఇక రోజూ పొద్దున లేవగానే ‘కృతి శెట్టి’ ముందు ఓ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతుంది.

3. వాటికీ దూరం.

Krithi Shetty Glamor Secrets
Krithi Shetty Glamor Secrets

స్వీట్స్ ను అమితంగా ఇష్టపడే ‘కృతి శెట్టి’ వాటికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది: పంచదారతో చేసిన పదార్థాలకు ఈ పంచదార బొమ్మ మరి ఎలా దూరం ఉండగలుగుతుందో ! అలాగే, ‘కృతి శెట్టి’ ప్రమాదకర రసాయనాలున్న కాస్మెటిక్ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించదు.

4. మేకప్:

Krithi Shetty Glamor Secrets
Krithi Shetty

‘కృతి శెట్టి’ షూటింగ్ లేకపోతే అస్సలు మేకప్ జోలికే వెళ్ళదు. పైగా హాని కలిగించే రసాయనాలతో ఉన్న మేకప్ ను, అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ కాకుండా ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ‘కృతి శెట్టి’ ఇష్టపడుతుంది. ఐతే.. ‘కృతి శెట్టి’ షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ లిప్ స్టిక్ మాత్రం వాడుతుంది. ఎస్టీ లాడర్ లిప్ స్టిక్ బ్రాండ్ అంటే.. ‘కృతి శెట్టి’కి అమితమైన ఇష్టం.

5. జిమ్ :

Krithi Shetty Glamor Secrets
Krithi Shetty Glamor Secrets

‘కృతి శెట్టి’ ప్రతీ రోజూ జిమ్ లో కనీసం గంట సేపైనా గడుపుతుంది. పైగా నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో తన ఉదర భాగాన్ని శ్రమ కలిగించే ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘కృతి శెట్టి’ ఉదర భాగం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Also Read:NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ సినిమాకి భారీ బడ్జెట్.. ఎన్ని వందల కోట్లు అంటే..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version