https://oktelugu.com/

Raja Mouli: ఆ విషయంలో ‘తగ్గెదేలే’ అంటున్న జక్కన్న..!

Director Raja Mouli: టాలీవుడ్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళికే  దక్కుతుంది.  ‘బాహుబలి’కి ముందు తెలుగు సినిమా ఒక స్థాయిలో ఉంటే ‘బాహుబలి’ సిరీసులతో ఆ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ‘బాహుబలి’ తర్వాత కూడా టాలీవుడ్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ‘బాహుబలి’ని మాత్రం బీట్ చేయలేకపోయాయి. దీంతో కొత్తగా ‘నాన్ బాహుబలి’ రికార్డులు తెరపైకి వచ్చాయి. ‘బాహుబలి’ వర్సెస్ ‘నాన్ బాహుబలి’ రికార్డుల వేట టాలీవుడ్లో మొదలైంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2022 / 01:10 PM IST
    Follow us on

    Director Raja Mouli: టాలీవుడ్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళికే  దక్కుతుంది.  ‘బాహుబలి’కి ముందు తెలుగు సినిమా ఒక స్థాయిలో ఉంటే ‘బాహుబలి’ సిరీసులతో ఆ రేంజ్ వరల్డ్ వైడ్ గా మారింది. ‘బాహుబలి’ తర్వాత కూడా టాలీవుడ్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ‘బాహుబలి’ని మాత్రం బీట్ చేయలేకపోయాయి.

    Rajamouli RRR Promotions

    దీంతో కొత్తగా ‘నాన్ బాహుబలి’ రికార్డులు తెరపైకి వచ్చాయి. ‘బాహుబలి’ వర్సెస్ ‘నాన్ బాహుబలి’ రికార్డుల వేట టాలీవుడ్లో మొదలైంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి సినిమాలు ఇప్పటి వరకు ‘నాన్ బాహుబలి’ సినిమా రికార్డులను తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అన్ని రికార్డులను చెరిపివేసింది.

    నాన్ బాహుబలి, బాహుబలి రికార్డులన్నింటిని కేవలం పదిరోజుల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ చెరిపివేయడం విశేషం. వేగంగా వెయ్యి కోట్ల మార్కును అధిగమించిన తొలి ఇండియన్ సినిమాగా వరల్డ్ వైడ్ గా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు నెలకొంది. ఈ మూవీ సక్సెస్ ను ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా తెలుగు మీడియాను రాజమౌళి పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    ‘బాహుబలి’ సినిమా విషయంలో తెలుగు మీడియా వ్యవహరించిన తీరుపై రాజమౌళి అసంతృప్తిగా ఉన్నారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్లు రాబట్టింది. అయితే తెలుగు మీడియా మాత్రం ‘బాహుబలి’కి నెగిటీవ్ రేటింగ్ ఇచ్చాయి. దీంతో ‘బాహుబలి-2’ సమయానికి రాజమౌళి తెలుగు మీడియా పూర్తిగా దూరం పెట్టారు.

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విషయంలోనూ  అదే జరిగింది. ఏదో మొక్కుబడి ఎలక్ట్రానిక్ మీడియాకు ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవి కూడా సైతం రాజమౌళి టీం రికార్డ్ చేసి ఇచ్చినవే. ప్రింట్ మీడియాను అయితే అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ భారీ సక్సస్ సాధించడంతో.. నిర్మాత దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ ఈవెంట్ అయ్యాక తెలుగు మీడియాతో ఒక విజయోత్సవ మీటింగ్ పెడుతామని అన్నారట.

    అయితే ఈ ప్రతిపాదనను రాజమౌళి తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు వస్తున్న సమయంలో కొన్ని తెలుగు వెబ్ ఛానళ్లు, మీడియా ఈ మూవీకి కూడా నెగిటీవ్ రిపోర్టు ఇచ్చాయి. ఈ విషయం కూడా రాజమౌళి దృష్టికి వచ్చింది. దీంతో తన సినిమాకు ఇలాంటి రేటింగ్ ఇస్తారని రాజమౌళి కోపంగా ఉన్నారట. అందుకే రాజమౌళి మీడియాకి, సక్సెస్ మీట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కూడా ఇదే ఫార్మూలా కొనసాగించనున్నారని టాక్.