Bollywood Trends: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఉడ్తా పంజాబ్ సినిమాలో తాను డ్రగ్స్ తీసుకునే సీన్ చూసి తన భార్య విడిపోతానని భయపెట్టిందని బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ చెప్పాడు. ‘నా భార్య మీరా సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. పెళ్లైన కొత్తలో ‘ఉడ్తా పంజాబ్’ సీన్ చూసి నా పక్క నుంచి వెళ్లిపోయింది. “నువ్వు ఇలాంటి వాడివా? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? నీతో కలిసి ఉండలేను. వెళ్లిపోతా” అని చెప్పింది. ఇది సినిమా మాత్రమేనని నచ్చజెప్పా’ అని తెలిపాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన హత్యాకాండ ఈ మూవీ స్టోరీ. ఇలాంటి కథతోనే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గత చిత్రం ‘ఏ థర్స్‌డే’ మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో ఆమె నటించి మెప్పించింది. అయితే.. ఈ సినిమా విషయంలో యామీ గౌతమ్ చాలా ఇబ్బంది పడింది అట. ఈ విషయాన్ని యామీ గౌతమ్ నే స్వయంగా చెప్పింది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. యశ్ రాజ్ ఫిలింస్ చేయబోతున్న క్రేజీ సినిమాలో అమృతా రావుకి హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలతో పాటు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయట. చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు.