Homeజాతీయ వార్తలుMLC Kavitha Liquor Scam: నమ్మి మోసపోయిన కేసీఆర్.. కవిత చెప్పినవన్నీ అబద్ధాలే: లిక్కర్ స్కాం...

MLC Kavitha Liquor Scam: నమ్మి మోసపోయిన కేసీఆర్.. కవిత చెప్పినవన్నీ అబద్ధాలే: లిక్కర్ స్కాం లో విస్తుపోయే వాస్తవాలు

MLC Kavitha Liquor Scam: ఆ మధ్య మోడీపై కవిత విరుచుకుపడింది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే మోడీ మా డాడీకి భయపడుతున్నాడని సెన్సేషనల్ కామెంట్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు వస్తానంటే “అబ్బే నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని” తప్పించుకుంది.. తర్వాత రమ్మని కబురు పంపింది. సరే ఇదంతా పక్కన పెడితే… నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఎంత? ఆమె చెప్తున్నట్టు నిజంగా తన ప్రమేయం లేదా? మరి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్లో ఆమె పేరు ఎందుకు ఉంది? ఫేస్ లైవ్ లో ఎందుకు అంత సేపు చర్చలు జరిపింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథనం.

MLC Kavitha Liquor Scam
MLC Kavitha – KCR

ఈడి ఏం చెబుతోంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని ఈడీ ఘంటాపథంగా చెబుతోంది. ఈ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఎక్కువగా లబ్ధి పొందింది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితే. ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్ధిదారులు కూడా ఉన్నారు. వారు ఒకరు అరబిందో ఫార్మా శరత్ చంద్ర రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కాం బయట పడినప్పటి నుంచి దాదాపు 39 మందిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విడతల వారీగా విచారించారు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం మొదటి ఛార్జ్ షీట్ లో కవిత పేరు చేర్చలేదు.. కానీ ఇదే విషయాన్ని మీడియా ప్రత్యేకంగా కవిత పేరును ఉటంకించింది. కానీ ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ కూడా తొందరపడలేదు.. పక్కాగా ఆధారాలు దొరికే వరకు వేచి చూశాయి. ఇప్పుడు కవిత పేరును సాక్షిగా కాకుండా లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.. ఈడీ తన విచారణ నివేదికలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వివిధ నిందితులను విచారించిన తర్వాత ముగ్గురు గ్రూప్ గా పిలిచే కవిత, శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రధాన లబ్ధిదారులుగా పేర్కొంది. అంతేకాదు ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ కు 100 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించి ఢిల్లీలో లిక్కర్ షాపులు కేటాయించుకున్నారు. 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినందుకు గాను ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో హోల్ సేల్ ట్రేడ్ తో పాటు ఢిల్లీలోని పలు జోన్లలో రిటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు సౌత్ గ్రూప్ దక్కించుకుంది.

ఇండో స్పిరిట్ లో 65% వాటా

ఈడీ కథనం ప్రకారం అరుణ్ పిల్లై కి సంబంధించి ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు 65% వాటా ఉందని పేర్కొన్నది.. అయితే ఇదే కంపెనీలో కవితతో పాటు మా గుంట శ్రీనివాసులు రెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నాడు.. ఢిల్లీ లిక్కర్ రిటైల్ షాపుల ద్వారా 14 కోట్ల మద్యం బాటిళ్ళు అమ్మడం ద్వారా 195 కోట్ల లాభాలు ఆర్జించారు.. ఇక ఢిల్లీలోని మరో హోల్ సేల్ మద్యం వ్యాపార సంస్థ అయిన లేక్ ఫారెస్ట్ 21 వేల కోట్ల రూపాయలను ఆర్జించింది. కేవలం ఐదు కోట్లు మాత్రమే లైసెన్స్ ఫీజుగా చెల్లించింది.. అంతేకాదు విజయ్ ఆరోరా ( ఆప్ బినామీ) పెర్నార్డ్ రికార్డ్( ఇది భారత్ లో అత్యధికంగా మద్యం తయారు చేసే సంస్థ) అనే సంస్థ మీద ఒత్తిడి తెచ్చి ఇండో స్పిరిట్ ను ఢిల్లీలో తమ హోల్ సేల్ ట్రేడర్ గా ప్రకటించాడు. ఇదే ఇండో స్పిరిట్ కంపెనీలో 65% వాటా ఉంది.

దీంతో ఏం చేశారు

ఢిల్లీ హోల్ సేల్ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలలో 12 శాతం ఆప్, సౌత్ గ్రూప్ పంచుకున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన విజయ్ ఆరోరా ఇచ్చిన సమాచారం ప్రకారం కవిత లిక్కర్ స్కాం లో నిందితులతో నిత్యం కాంటాక్ట్ లో ఉంది.. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్, హైదరాబాదులోని తన స్వగృహంలో కలిసింది. పలు సందర్భాల్లో కవిత” ఫేస్ టైం” అనే ఆప్ ద్వారా టెలి వీడియోలో ముఖాముఖిగా మాట్లాడింది. “ఫేస్ టైం” ఆప్ అనేది కేవలం ఆపిల్ ఐ ఫోన్ లేదా ఆపిల్ మాక్ కంప్యూటర్ లో మాత్రమే పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ ఐఓఎస్ సిస్టం మీదనే పనిచేస్తుంది. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడిందో వెంటనే నిందితులు మొత్తం తమ ఐఫోన్లను ధ్వంసం చేశారు. వాటి విలువ కోటి 70 లక్షల దాకా ఉంటుందని సమాచారం. ఎమ్మెల్సీ కవిత 10 ఐఫోన్లను ధ్వంసం చేశారంటే ఈ స్కాం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. కవితతో మాట్లాడిన వారు కూడా ఐఫోన్ అనే వాడటంతో వారు కూడా తమ ఫోన్లను ధ్వంసం చేశారు. ఇక ఈడీ ఎదుట అరుణ్ పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవిత, విజయ్,అరుణ్ తరచూ ఢిల్లీలోని హోటల్లో కలుసుకునేవారు. ఆప్ కి తాము ఇచ్చిన ముడుపుల మీద, తమకు రావలసిన కిక్ బాక్సుల వివరాలు గురించి మాట్లాడుకునేవారు. అయితే ఇదే సమయంలో అరుణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు బినామీగా ఉన్నాడు.. ఇండస్పిరిట్ మరో భాగస్వామి సమీర్ మహేంద్రు కూడా ఈడీ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పాడు.. అంటే ఇద్దరు కూడా నిజాలు చెప్పినట్టే. దీనిని బట్టి కవిత మీద ఉన్న కేసుకి బదులుగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసుల విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మెడ చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది.. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారిగా ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణ మీద 2020లో ఆమె మీద కేసు నమోదు అయింది. అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు నోటిఫికేషన్ ఇచ్చి విచారణ చేసి వదిలేసింది.. కానీ పలు కేసుల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పటికీ ఉంది.

MLC Kavitha Liquor Scam
MLC Kavitha

కావాలనే ఇరికించారా

అరవింద్ కేజ్రీవాల్ ను తక్కువ అంచనా వేసి కేసిఆర్ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఎందుకంటే అప్రూవర్ గా మారిన విజయ్ ఆరోరా కేజ్రీవాల్ సూచనలతోనే కవిత పేరుని వ్యూహాత్మకంగా బయట పెట్టించాడు.. కెసిఆర్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాడు.. మహా అయితే తన పేరు బయటికి వస్తుందని కేజ్రీవాల్ అనుకున్నాడు. అతడు అనుకున్నట్టుగానే జరిగింది.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అది నిరూపితమైంది.. మొన్న బీహార్ వెళ్లి నితీష్ కుమార్ ఎదుట కెసిఆర్ భంగపడ్డాడు.. ఇప్పుడు అరవింద్ తో చేతులు కలిపి భంగపడ్డాడు.. మొత్తానికి రెంటికి చెడ్డ రేవడి కాబోతున్నాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version