https://oktelugu.com/

Sukumar- Anupama Parameswaran: ఆ చిన్న తప్పుకు అనుపమ కెరీర్ నాశనం చేసిన సుకుమార్… తెరపైకి షాకింగ్ ఫ్యాక్ట్!

Sukumar- Anupama Parameswaran: ఒక్క హిట్ మూవీ పదేళ్లకు సరిపడా మైలేజ్ ఇస్తుంది. దర్శకులు, నిర్మాతలకు ఈ ఫార్ములా వర్తించదు కానీ, హీరో హీరోయిన్స్ మంచి సినిమాతో చాలా ఏళ్ళు సర్వైవ్ కావచ్చు. అదే సమయంలో సక్సెస్ ఫుల్ మూవీ మరికొన్ని హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలు తెస్తుంది. పెద్ద నిర్మాణ సంస్థలు, టాలెంటెడ్ దర్శకులు సక్సెస్ ఫుల్ యాక్టర్స్ వెనుకబడతారు. అయితే సినిమా అనే జూదంలో అదృష్టం కొందరినే వరిస్తుంది. ప్లేటులో ఉన్న పదార్థం నోట్లోకి […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2022 / 06:55 PM IST
    Follow us on

    Sukumar- Anupama Parameswaran: ఒక్క హిట్ మూవీ పదేళ్లకు సరిపడా మైలేజ్ ఇస్తుంది. దర్శకులు, నిర్మాతలకు ఈ ఫార్ములా వర్తించదు కానీ, హీరో హీరోయిన్స్ మంచి సినిమాతో చాలా ఏళ్ళు సర్వైవ్ కావచ్చు. అదే సమయంలో సక్సెస్ ఫుల్ మూవీ మరికొన్ని హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలు తెస్తుంది. పెద్ద నిర్మాణ సంస్థలు, టాలెంటెడ్ దర్శకులు సక్సెస్ ఫుల్ యాక్టర్స్ వెనుకబడతారు. అయితే సినిమా అనే జూదంలో అదృష్టం కొందరినే వరిస్తుంది. ప్లేటులో ఉన్న పదార్థం నోట్లోకి వెళ్లే వరకు కూడా సందేహమే. చిత్ర పరిశ్రమలో అంత అనిశ్చితి నెలకొని ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ రంగస్థలం చిత్రంలో నటించే ఛాన్స్ తృటిలో చేజార్చుకున్నారన్న వార్త సంచలనంగా మారింది.

    Sukumar- Anupama Parameswaran

    ఇండస్ట్రీ హిట్ రంగస్థలం చిత్రంలో సమంత కాదు అనుపమ నటించాల్సిందన్న షాకింగ్ ఫ్యాక్ట్ సుకుమార్ ఇటీవల బయటపెట్టారు. 18 పేజెస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడారు. ఆయన 18 పేజెస్ చిత్ర హీరోయిన్ అనుపమని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగస్థలం చిత్రంలో అనుపమ నటించాల్సింది. ఆడిషన్స్ కి వచ్చిన అనుపమ ఏమి అడిగినా వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. దాంతో నాకు సందేహం కలిగింది. చిన్న పిల్ల, మాటిమాటికి అమ్మ వైపు చూస్తుంది. చేయగలదా? లేదా? అని ఎంపిక చేయలేదు, అన్నారు.

    అనుపమ మంచి నటి, అందమైన హీరోయిన్. ఆమెకు తెలుగు కూడా బాగా వచ్చు. ఖచ్చితంగా భవిష్యత్ లో ఆమెతో సినిమా చేస్తాను, అని సుకుమార్ అన్నారు. సుకుమార్ మాటలు విన్నాక రంగస్థలం వంటి గొప్ప సినిమా అనుపమ చేజార్చుకుందా అని ఆశ్చర్యపోవడం అందరివంతయ్యింది. రామ్ చరణ్ హీరోగా 2018లో విడుదలైన రంగస్థలం టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. అంతకు మించి గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. రంగస్థలం మూవీ అనుపమకు పడితే ఆమె కెరీర్ ఎక్కడో ఉండేది.

    Anupama Parameswaran

    కేవలం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవనే కారణంతో సుకుమార్ రిజెక్ట్ చేశాడు. రంగస్థలం విడుదలైన ఏడాది అనుపమ కృష్ణార్జునయుద్ధం, ఐ లవ్ యు తేజ్, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాలు చేశారు. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఐ లవ్ తేజ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వరుస ప్లాప్స్ తో ఆమె కెరీర్ నెమ్మదించింది. అనుపమకు ఆఫర్స్ తగ్గాయి. సమంతకు రంగస్థలం చిత్రం మరింత పేరు తెచ్చింది. అయితే అప్పటికే ఆమె స్టార్ కాబట్టి మూవీ మిస్ అయినా సమంతకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అనుపమ మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కోల్పోయారు. సుకుమార్ తనకు తెలియకుండానే అనుపమకు తీరని అన్యాయం చేశాడు.

    Tags