KCR vs BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్టు ‘కేసీఆర్ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నట్టే’ కనిపిస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్ చూశాక అందరికీ అదే భావన కలిగింది. జాతీయ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే చాలు ప్రశ్న పూర్తికాకుండానే వారిపై విరుచుకుపడుతున్నాడు.. అసలే ప్రశ్నే తప్పు అంటూ మండిపడుతున్నారు. వారికి పూర్తి ప్రశ్నను అడిగే వరకూ కూడా కేసీఆర్ ఆగలేకపోవడం కనిపించింది.

కేసీఆర్ ను ప్రశ్నించకుండానే ఆయనే సమాధానాలు చెప్పుకొచ్చారు. ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీపై.. ఆ పార్టీ బడ్జెట్, విధానాలను తూర్పారపట్టారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అంటూ నినదించారు.
ఒకానొక సందర్భంలో ఇటీవల బయటపడ్డ నీటి పారుదల శాఖ డైరెక్టర్ ‘రజత్ కుమార్’ అవినీతి వ్యవహారంపై స్పందిస్తే.. దానిపై సరైన ఆధారాలు లేవని.. ఎవరో ఏదో రాస్తే వాటిని పట్టించుకోం అంటూ స్పష్టం చేశారు. సరైన ఆధారాలుంటే చూపించండి అంటూ మీడియాపైనే దబాయించారు.
తాను డిఫెన్స్ లో పడబోయే ప్రశ్నలపై కేసీఆర్ ముందుగానే కౌంటర్ అటాక్ చేశారు. థర్డ్ ఫ్రంట్ లేదని.. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు లేవని.. అవంతా మీడియా సృష్టి అంటూ కేసీఆర్ సర్దుకున్నారు.
కేసీఆర్ లో బీజేపీపై ఫస్ట్రేషన్ పెరిగిపోయిందన్నది వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ దూసుకొస్తోంది. ప్రత్యామ్మాయ శక్తిగా ఎదుగుతోంది. ఇటీవల పరిణామాలతో తెలంగాణలో వచ్చేసారి కేసీఆర్ కు అధికారం కానకష్టంగా మారింది. రెండు సార్లు అధికారంలో ఉండడంతో మూడోసారి గెలవడం అంత ఈజీ కాదంటున్నారు. ఆ వ్యతిరేకత.. తగ్గించడం.. బీజేపీపై అనుకూలతను దెబ్బతీసేందుకే కేసీఆర్ ఇలా చేశాడని.. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురించేందుకు రెడీ అయ్యాడని.. తెలంగాణలోనూ ఆ పార్టీ భరతం పట్టాలని చూస్తున్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
[…] Also Read: KCR vs BJP: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ … […]
[…] Also Read: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ అయ్య… […]
[…] Also Read: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ అయ్య… […]