Kashmir Land grabbers : కాశ్మీర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆ ఉగ్రవాద దాడులు.. నిత్యం బాంబు మోతలతో హోరెత్తిపోయే ప్రాంతాలు.. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో తెలియదు.. ఎప్పుడు ఏ ఉగ్రవాది ఇంటి తలుపు తడతాడో తెలియదు. నా అనే వాళ్ళు రారు. పేరుకు అది భూతల స్వర్గమే కానీ… అక్కడి ప్రజలు అనుభవించేది మాత్రం నిత్య నరకం. అక్కడ దేశ రాజ్యాంగం అమలు అయ్యేది కాదు. దేశ జెండా కూడా ఎగిరేది కాదు. భారతదేశంలో భాగమే కానీ… అదొక స్వతంత్ర ప్రాంతంగా ఉండేది. కానీ 2019 లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదాను ఎత్తేసి.. జమ్ము, లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో కొత్త చరిత్ర మొదలైంది. అంతేకాదు ఈ ప్రాంతానికి సమర్ధుడైన లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించడంతో నయా కాశ్మీర్ రూపు దిద్దుకుంటున్నది.
మనోజ్ సిన్హా ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించిన తర్వాత కేంద్రం తన వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తున్నది. పాలనా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అవినీతి అంతానికి కంకణం కట్టుకుంది. అంతేకాదు మనోజ్ నాగరిక్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి 105 మంది ఉద్యోగులను విడుదల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించడాన్ని మనోజ్ తప్పనిసరి చేశారు.. ఖాళీల భర్తీకి నిర్దిష్ట నియామక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం టెండర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా పాలనలో పారదర్శకతను పెంచింది.. 2019 నుంచి మనోజ్ సిన్హా నియమితులయ్యాక సమూల మార్పులు చేశారు.
ఈ క్రమంలోనే భూమి చుట్టూ కాశ్మీర్ రాజకీయాలు తిరుగుతున్నాయి. కశ్మీర్ పార్టీలు రోష్ని చట్టం పేరుతో దోచుకుతిన్నాయి.. ఈ చట్టం పేరుతో కబ్జా చేసిన కశ్మీర్ పార్టీల నేతలు, కబ్జాదారులపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఉక్కుపాదం మోపుతున్నారు. కశ్మీర్ లో దోచుకున్న భూమిని రికవరీ చేస్తున్నారు. అసలు ఈ చట్టం ఏంటి? ఎందుకు రికవరీ చేస్తున్నారు.? ఈ వివాదం ఏంటి అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..