Jayamma Panchayati Trailer Talk: స్టార్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా సుమ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. సుమకు పోటీగా బుల్లితెరపై ఎంతమంది వచ్చినా ఆమె హవా మాత్రం తగ్గడం లేదు. బుల్లితెరపై వరుస షోలు చేస్తూనే సుమ కనకాల సినిమా ఈవెంట్స్ చేస్తూ అందరినీ ఎంటటైన్మెంట్ చేస్తూ ఉంటోంది.

తెలుగు సినిమా ఈవెంట్స్ జరుగుతున్నాయంటే సుమ ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల ఈవెంట్స్ కైతే సుమ తప్పనిసరిగా అయిపోయింది. అంతలా సుమ మెస్మరైజ్ చూస్తూ ఉంటోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం పలుమార్లు సుమ యాంకరింగ్ ను ఆకాశానికి ఎత్తిన సంఘటనలున్నాయి. సుమ వాగ్దాటికి తాను అభిమాని అంటూ మెగాస్టార్ స్వయంగా చెప్పడం విశేషం.
కెరీర్లో మొదట్లో పలు సినిమాల్లో నటించిన సుమ ఆ తర్వాత కేవలం యాంకరింగ్ కే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత సుమ కనకాల వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సుమ లీడ్ రోల్లో నటించిన ‘జయమ్మ పంచాయతీ’ మే 6న రిలీజుకు రెడీ అవుతోంది. ఈక్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జయమ్మ పంచాయతీ’ ట్రైలర్ ను కొద్దిసేపటి కిత్రమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిగంటల్లోనే వేలల్లో లైక్స్ తో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. 98సెకన్ల నిడివితో విడుదలైన ‘జయమ్మ పంచాయతీ’ ట్రైలర్ ను చూస్తే సుమ వన్ ఆర్మీలా సినిమాను నడిపించినట్లు అర్థమవుతోంది.
జయమ్మ(సుమ) ఇంటి సమస్య కాస్త ఊరి సమస్యగా మారిందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. జయమ్మ కూతురు గుడిలో పనిచేసే అబ్బాయితో ప్రేమలో పడుతోంది. ఈ విషయంకాస్త పంచాయితీకి వెళుతుంది. జయమ్మ ఇంటి గొడవ ఊరి సమస్యగా ఎలా మారిందనే అంశాన్ని హిలేరియల్ కామెడీ ఎంటటైనర్ గా దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తీర్చిద్దాద్దాడు.
శ్రీకాకుళంలో యాసలో మాట్లాడిన సుమ(జయమ్మ)తో దర్శకుడు బూతులను కూడా ట్రైలర్లో పలికించాడు. మొత్తానికి ట్రైలర్ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు కీరవాణి అందించగా వెన్నల కియేషన్స్ బ్యానర్లో బలగ ప్రకాశ్ నిర్మించారు. వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సుమకు ‘జయమ్మ పంచాయతీ’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచిచూడాల్సిందే..!