Jasprit Bumrah vs Hardik Pandya : ఐపీఎల్ సీజన్ – 17 వేదికగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఫీల్డ్ సెటప్ విషయంలో పాండ్యా సూచనలను బుమ్రా పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. వెంటనే రోహిత్ శర్మ జోక్యం చేసుకున్నాడు. రోహిత్ ఎంట్రీతో హార్ధిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సారథి మార్పుపై అసంతృప్తి..
గత జీసన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్ధిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. వచ్చి రాగానే ముంబై మేనేజ్‌మెంట్ అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై మాజీ కెప్టెన్ రోహి™Œశర్మతోపాటు జస్‌ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నారు. అభిమానులు కూడా ముంబై మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఇప్పటికీ తప్పు పడుతున్నారు.
ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యాడు..
ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ మార్పు విషయంలో బుమ్రా సారథిని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్ఘాంతపోయిన రోహిత్.. కెప్టెన్ సూచించిన ఫీల్డ్ పొజిషన్‌కు వెళ్లాడు. ఇదిలా ఉండగా, సాధారణంగా రోహిత్ టీమిండియా సార థిగా ఫీడ్లర్లపై అరవడం మనకు కనిపిస్తుంది. కానీ రోహిత్ మాత్రం తాజా మ్యాచ్‌లో ఫీల్డ్ పొజిషన్‌కు వెళ్లడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎలా ఉండే రోహిత్ ఎలా అయ్యాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో ఫీల్డర్లపై స్పందించే రోహిత్ ఇప్పుడు గప్ చుప్ అవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. అభిమానులు కూడా హార్ధిక్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
Mumbai Indians team is no more #ONEFAMILY
This team has completely broken.
Nothing looking good Between Hardik Pandya, Rohit Sharma and Jasprit Bumrah in this. pic.twitter.com/BslDBSo8cs— Satya Prakash (@Satya_Prakash08) March 24, 2024