Japan Earthquake: చిగురుటాకులా వణికిన జపాన్.. భూకంప వీడియోలు వైరల్

ఎదురుగా అంత ప్రమాదం పెట్టుకున్న అక్కడ ప్రజలు చూపిన తెగువకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు భూమి కనిపిస్తున్నా.. వీడియోలుతీయడం సాహసమే.

Written By: Dharma, Updated On : January 2, 2024 11:50 am

Japan Earthquake

Follow us on

Japan Earthquake: మరో విపత్తు జపాన్ ను వణికించింది. కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు న్యూ ఇయర్ వేడుకల్లో ఉండగా భారీ భూకంపం వచ్చింది. అంతటితో ఆగకుండా మరో 50 సార్లు కంపించింది. అక్కడ పరిస్థితిని చూస్తే సునామి తప్పదని భావించారు. కానీ అటువంటిదేమీ జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూమి కనిపించిన తీరుతో మాత్రం ఉనికి పోయారు. ఊపిరి బిగ పట్టుకొని ఆ దృశ్యాలను అక్కడి ప్రజలు తమ కెమెరాలు బంధించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్ళ ముందు కదులుతున్న గోడలు, భవనాలను చూస్తే ఎవరికైనా కాళ్లు వణకాల్సిందే.

అయితే ఎదురుగా అంత ప్రమాదం పెట్టుకున్న అక్కడ ప్రజలు చూపిన తెగువకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు భూమి కనిపిస్తున్నా.. వీడియోలుతీయడం సాహసమే. వచ్చింది మామూలు భూకంపం కాదు. భారీ భూకంపం. రిక్టర్ స్కేలు దాని తీవ్రతను 7.6 గా నమోదు చేసింది. ఆ తరువాత కూడా వరుస ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు సునామీ హెచ్చరిక జారీ అయింది. గతంలో ఇటువంటి భారీ భూకంపంతో జపాన్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. అయినా సరే ప్రజలు ఈ భూకంపానికి చలించలేదంటే అభినందించాల్సిన విషయమే.

జపాన్ వ్యాప్తంగా భూకంప తీవ్రత ఉంది. ముఖ్యంగా నార్త్ సెంట్రల్ జపాన్ లో పెను ప్రభావం చూపింది. ఇషివాక, నీగాటా, టొయామా తదితర తీర ప్రాంత నగరాలపై సునామీ అలల ప్రభావం కనిపించాయి. భూకంపంతో రోడ్లు బీటలు వారాయి. భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. జపాన్ చుట్టూ సముద్రం ఉంటుంది. సునామీ ఏర్పడితే మాత్రం పూర్తిగా దేశం జల సమాధి అయ్యే అవకాశం ఉంది. అయితే తాజా భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఆ వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. భూమి పూరీల ఉప్పుతోంది… పగులుతోంది.. కదిలిపోతోంది.. కాళ్ళ కింద కంపనం.. ప్రాణానికి పెను ప్రమాదం..ఇటువంటి సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ఎవరైనా బయటకు పరుగులు తీస్తారు. కానీ అక్కడి ప్రజలు వీడియోలను తీసి ఆశ్చర్యపరిచారు.