Internet speed : ప్రస్తుతం ఫోన్ల వినియోగం అధికంగానే పెరిగింది. ఎక్కడ చూసిన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని ఉన్నవాళ్లే కనిపిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా మొబైల్స్ వాడుతున్నారు. అయితే ఇప్పుడంటే 5జీ ఇంటర్నెట్ వచ్చింది. కానీ గతంలో ఇంత స్పీడ్ నెట్‌వర్క్ ఉండేది కాదు. మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ వాడటానికి చాలా ఇబ్బంది పడుతుండే వాళ్లు. ఈ 5జీ నెట్‌వర్క్ యుగంలో మనకి కొన్నిసార్లు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంటే.. చిరాకు వస్తుంది. ఫోన్ పట్టుకుంటే ఇంటర్నెట్ లేకపోతే ఎందుకు ఈ ఫోన్ అనిపిస్తుంది. అయితే ఈ జనరేషన్‌లో కూడా చాలా మంది ఇంటర్నెట్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్‌గా రావడం లేదని ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.
ఫోన్ రీస్టార్ట్ చేయాలి
మీరు సిగ్నల్స్‌లో ఉన్న కూడా ఇంటర్నెట్ స్పీడ్‌గా రాకపోతే మొబైల్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి. కొంతసమయం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే.. ఇంటర్నెట్ స్పీడ్‌లో తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి. ఇలా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకూడదని అనుకుంటే ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్, ఆఫ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కొంతవరకు ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.
యాప్స్ అప్‌డేట్
కొందరు మొబైల్ యాప్స్‌ను అసలు అప్‌డేట్ చేయరు. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్పుడప్పుడు అప్‌డేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ కొంత పెరుగుతుంది.
క్రాష్ డేటా క్లియర్ చేయండి
సాధారణంగా మనకి అవసరం లేని డేటాను డిలీట్ చేస్తుంటాం. ఇలా డిలీట్ చేసిన డేటా ఎక్కువగా స్టోరేజ్‌లో ఉంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి క్రాష్ చేసిన యాప్‌లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకవాలి. వెబ్ బ్రౌజర్‌లో ఉన్న డేటాను కూడా క్లియర్ చేస్తుండాలి. ఇలా చేస్తుంటే మీ నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.
క్యాచీ క్లియర్ చేయండి
క్యాచీ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ చాలా వరకు తగ్గిపోతుంది. కనీసం వారానికొకసారి అయిన క్లియర్ క్యాచీ చేయాలి. క్యాచీని డేటాను డిలీట్ చేయడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీనిని క్లియర్ చేయకపోతే మొబైల్ స్లో అవుతుంది.
ఆటో అప్డేట్ చేయాలి
మొబైల్‌ను ఎప్పటికప్పుడూ ఆటో అప్డేట్ చేయాలి. ఇలా చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ తొందరగా పెరుగుతుంది. మొబైల్ కూడా హ్యాంగ్ కాకుండా ఉంటుంది. అప్‌డేట్ చేయకపోతే మొబైల్ వేగం తగ్గుతుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్
బ్యాక్‌గ్రౌండ్‌లో వాడిన యాప్స్ ఉంటే వెంటనే క్లియర్ చేయాలి. అలాగే సెట్టింగ్‌ల్లోకి వెళ్లి మీరు ఎక్కువగా ఏ యాప్ వాడుతున్నారో.. దానికి నెట్‌వర్క్ స్పీడ్ పెట్టుకోవాలి.
వైఫై ఉపయోగించేవాళ్లు..
వైఫై వాడుతున్న వాళ్లు రౌటర్‌ను రీస్టార్ట్ చేయాలి. మరీ తక్కువగా నెట్ సిగ్నల్ వస్తుంటే.. రౌటర్ ప్లేస మార్చడం మంచిది. ఈ చిట్కాలు పాటిసే.. మొబైల్ లేదా వైఫై ఇంటర్నెట్ స్పీడ్ తొందరగా పెరుగుతుంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Follow these tips to get internet speed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com