Pawan Kalyan: జనసేన అధినేత పవన్ ఇప్పుడొక ఫైర్ బ్రాండ్. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతున్నా.. అధికారంలోకి రాకపోయినా పవన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తనకు తాను గెలవకపోయినా ఎదుటి వారి గెలుపోటములను మాత్రం నిర్ధేశించగలరు. గత అనుభవాలు దీనిని తేటతెల్లం చేస్తున్నాయి. గతంతో జరిగిన తప్పదాలను విజయాలకు మెట్లుగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రజలు ఆయన్ను ఓడించినా.. ఆయన ప్రజలను మాత్రం వదల్లేదు. వారిపై కోపం పెంచుకోలేదు. నాకెందుకీ రాజకీయాలంటూ విరక్తి చెందలేదు. తనను నమ్మిన కార్యకర్తలు, అభిమానులను సైతం విస్మరించలేదు. అటు విశ్వసనీయతను పెంచుకుంటూ ప్రజల అభిమానాన్ని సొంతంచేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలకు తప్పొప్పులను గుర్తుచేస్తున్నారు. అయితే ఏనాడూ ఆయన అధికారం కోసం సాగిలాలు పడలేదు. అందుకే రాష్ట్రంలో బలం పెంచుకుంటున్నారు. అలాగని సంస్థాగత నిర్మాణమంటూ లేదు. నాయకుల గణమంటూ లేదు. కేవలం తన నోటి నుంచి వచ్చే ప్రజా సమస్యల మాటలతోనే పవన్ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన బలాన్ని పెంచుకుంటున్నారు.

అన్నింటా స్పష్టత..
పవన్ అంటే అధికార పక్షం తెగ భయపడుతుండగా.. విపక్షాలు కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న పవన్ కు ఉన్న స్పష్టత ఏ నాయకుడుకి లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. మిగతా రాజకీయ పక్షాలు రాజకీయ అజెండాతో పనిచేస్తుండగా పవన్ ఒక్కరే ప్రజా సమస్యపై పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతిచ్చినా… నాలుగేళ్లపాటు వాటితో కలిసి పనిచేసినా ఏనాడూ పదవుల గురించి ఆలోచించలేదు. పదవులు ఇస్తామన్నా గౌరవంగా తిరస్కరించిన సందర్బాలు సైతం ఉన్నాయి. కుల సంఘాల నాయకులకే పదవులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్న వేళ.. లక్షలాది ఓట్లను సొంతం చేసుకున్న పవన్ కు పదవులు రావా? కానీ ఒక సిద్ధాంతం కోసం పోరాడే క్రమంలో పవన్ అధికారం అనేది తన మదిలో రానివ్వలేదు. సుదీర్ఘ కాలం ప్రజలతో ఉండి వారి అభిమానంతో అధికారం సాకారం చేసుకోవడానికే పవన్ మొగ్గుచూపుతున్నారు.
Also Read: Maharashtra Politics: ‘మహా’ రాజకీయంలో మలుపు.. ఏకంకానున్న ఏక్ నాథ్, ఉద్దవ్ లు.. బీజేపీ మధ్యవర్తిత్వం?
ప్రజా సమస్యలే అజెండా..
పవన్ పార్టీ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. తన ఆలోచనలను మార్చుకోలేదు. తన విధానాలు దారి తప్పలేదు. తొలి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతున్నారు. తాను మద్దతిచ్చిన ప్రభుత్వం అయినా.. తాను వ్యతిరేకించిన ప్రభుత్వం అయినా ప్రజా సమస్యల ప్రస్తావించే తీరు, పంథాను మాత్రం మార్చుకోలేదు. ప్రసంగాల్లో సైతం అంతా క్లీయర్ కట్టే.. ఆవేశంగా మాట్లాడినా దాని వెనుక ఆలోచన ఉంటుంది. ఎక్కడైనా రాజకీయాలు చేసేవారు నేరుగా ఓట్లను అభ్యర్థిస్తారు. తమకే ఓటు వేయాలని కోరుతారు. అందుకు ఉన్న ఆవశ్యకతలు, అవసరాలను గుర్తుచేస్తారు. కానీ పవన్ ప్రసంగంలో అవేవీ కనిపించవు. మా విధానాలు నచ్చితేనే ఓటేయ్యండి.. అని మాత్రమే కోరుతారు. మీరు వేస్తే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాను. లేకుంటే ప్రజల మధ్య నుంచే గొంతు ఎత్తుతానంటూ చెబుతుంటారు.

కొన్ని వర్గాలు టర్న్..
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమే పరమావధిగా పనిచేస్తుంది. అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. మిగతా రాజకీయ పార్టీల నుంచి నేతలను ఆహ్వనిస్తుంది. తటస్టులను పార్టీలో చేర్చుకుంటుంది. కానీ జనసేన విషయంలో మాత్రం అటువంటివేవీ మచ్చుకైనా కానరావు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నానా మాటలు చెబుతారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటల మాట దేవుడెరుగు. దేశంలో జరుగుతున్న తీరిదే. కానీ అలా చేయడానికి పవన్ ఇష్టపడడం లేదు. అందుకే నిత్యం దైర్యంగా ఒక మాట చెబుతుంటారు. తనకు అధికారం ముఖ్యం కాదని. 25 ఏళ్లపాటు అయినా ఇదే విధంగా ఉంటానని గంటాపధంగా చెబుతుంటారు. అయితే ఈ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఎక్కడ తనకు రాజకీయ అధికార కాంక్ష లేదని ప్రజలు అపోహ పడతారన్న భయం కూడా పవన్ కు ఉండదు. ఇప్పుడిప్పుడే ప్రజలు పవన్ ఔధార్యాన్ని గుర్తిస్తున్నారు. పవన్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు సైతం టర్న్ అయ్యాయి.

ప్రసంగాల్లో స్పష్టత..
పవన్ ప్రసంగాల్లో కూడా స్పష్టత ఉంటుంది. ఎదైనా అంశంపై మాట్లాడితే మూలాల నుంచి శోధించి వ్యాఖ్యానాలు చేస్తారు. పనికి రాని కామెంట్లు చేయరు. ఒక పద్ధతి ప్రకారం ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటారు. అందుకే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఉన్నా.. పవన్ అనే మాటలే అటు ప్రజల్లోకి… అటు ప్రభుత్వానికి తాకుతుంటాయి. అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా పవన్ నే టార్గెట్ చేస్తుంటారు. వారి విమర్శల వెనుక కారణం కూడా అదే. అటు పవన్ కూడా తాను అనుకున్నది ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంటారు. గత ఎన్నికల్లో టీడీపీకి అధికారం రానివ్వనని కూడా హెచ్చిరించారు. అప్పడు అదే జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని కూడా చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనను విజయతీరాల వైపు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.
Also Read:GST Rate Hike: మోడీ సార్ ‘జీఎస్టీ’ బాదుడు.. రేపటి వీటి ధర భారీగా పెంపు