Kashmir: 1989-94 మధ్య జరిగిన పది ప్రముఖ వ్యక్తుల హత్యలపై తిరిగి దర్యాప్తు

1989-94 మధ్య జరిగిన పది ప్రముఖ వ్యక్తుల హత్యలపై తిరిగి దర్యాప్తును కేంద్రం ప్రారంభించింది. కేసులను రీఓపెన్ చేసింది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : August 9, 2023 10:03 pm

కశ్మీర్.. 1989 అల్లర్లను ఎవరూ మరిచిపోలేదు. లక్షలాది కశ్మీర్ పండిట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ వలసపోయారు. చాలా ప్రముఖులు జడ్జి, ప్రభుత్వ అధికారులు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు అందరినీ చంపారు. హిందువులు, ముస్లింలు, రాజకీయ నాయకులను చంపారు. కానీ ఎవ్వరి మీద ఇప్పటివరకూ చర్యల్లేవు. హంతకులను పట్టుకోలేదు. పట్టుకున్న వారికి సాక్ష్యాలు లేక విడుదల చేయలేదు.

కశ్మీరీ ఫైల్స్ సినిమా చూసి ఉంటే అందులో కొన్ని ఘటనలు సినిమాలో నిక్కచ్చిగా చూపించారు. ఇవ్వాళా కశ్మీర్ లో ఇంత జరిగిందన్నది తెలియని సమాజానికి చూపించారు. ఇంతవరకూ హంతకులను శిక్షించబడలేదన్నది తెలిసింది. ప్రభుత్వం మేలుకుంది. ప్రజలు మేలుకున్నారు.

జేకేఎల్ఎం చీఫ్ యాసిన్ మాలిక్ ను వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇదే యాసిన్ ను ప్రధాని కార్యాలయానికి తీసుకొచ్చి స్వాగత సత్కారాలు చేసిన పరిస్థితి. హురియత్ కాన్ఫరెన్స్ లాంటి కశ్మీర్ నేతలకు ప్రభుత్వమే సకల సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అన్నింటిని తీసేసింది. ఇప్పుడు కశ్మీర్ ప్రక్షాళన చేశారు. కశ్మీర్ ను అభివృద్ధి చేశారు.

1989-94 మధ్య జరిగిన పది ప్రముఖ వ్యక్తుల హత్యలపై తిరిగి దర్యాప్తును కేంద్రం ప్రారంభించింది. కేసులను రీఓపెన్ చేసింది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.