Don 3: ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఐకానిక్ ‘డాన్’ ఫ్రాంచైజీ గ్రాండ్ గా రిటర్న్ అవ్వడానికి రంగం సిద్ధం అయిపోయింది. అమితాబచ్చన్ డాన్ సినిమా వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ అలాంటి కథలకు ఫిదా అవుతూ వచ్చింది. ఇక ఆ తరువాత ఆ సినిమాని షారుక్ ఖాన్ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో వచ్చిన మునుపటి రెండు డాన్‌లలో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈసారి భారీ అంచనాలున్న ‘డాన్ 3’లో మాత్రం రణ్ వీర్ సింగ్ కొత్త ‘డాన్’గా కనిపించడానికి సిద్ధమైపోయాడు.
ఇదే విషయాన్ని ఈ సినిమా దర్శకుడు నిన్న అధికారికంగా ప్రకటించారు. దీంతో తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకుల నిలిచిపోయిన రణవీర్ సింగ్, ఇప్పుడు 2025లో హిందీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకటైన ఈ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ని సొంతం చేసుకున్నారు.
‘డాన్’ సిరీస్ ఎన్నిసార్లు తీసిన కానీ, ప్రతి సినిమా మంచి విజయం సాధించడానికి ముఖ్య కారణం ఆ సిరీస్ రివర్టింగ్ కథనాలు, థ్రిల్లింగ్ యాక్షన్ అలానే డాన్ పాత్రలు పోషించే హీరోలా అద్భుత నటన . రణవీర్ సింగ్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రను పోషించడానికి షారుఖ్ ఖాన్ షూస్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇదే విషయం గురించి ఈరోజు టీజర్ కూడా ఇచ్చేశారు సినిమాలో. టీజర్‌లో, “షేర్ జో సో రహా హై వో జాగేగా కబ్, పూచ్తే హై యే సబ్. ఉన్సే కహ్ దో కి జాగ్ ఉతా హూ మైన్. క్యా హై తాకత్ మేరీ, క్యా హై హిమ్మత్ మేరీ ఫిర్ దిఖానే కో. మౌత్ సే ఖేల్నా జిందగీ హై మేరీ, జీత్నా హీ మేరా కామ్ హై. తుమ్ తో హో జాంటే, జో మేరా నామ్ హై. 11 ముల్కో కీ పోలీస్ ధుంధూన్తీపర్ హై పకడ్ పాయా హై ముజ్కో కాన్.” అని వాయిస్‌ఓవర్ తో రణవీర్ సింగ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు దర్శకుడు.
షారుఖ్ ఖాన్ యొక్క ప్రసిద్ధ పంక్తి “మై హూన్ డాన్” అని చెప్పేటప్పుడు రణవీర్ సింగ్ ముఖాన్ని చూపించారు. మొత్తానికి ఇలా హిందీలో అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత రణవీర్ సింగ్ డాన్ పాత్ర పోషించడం అతని అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మరి ఈ హీరో డాన్ క్యారెక్టర్ లో ఎలా మెప్పిస్తారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
ఇక ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రితేష్ సిధ్వానీ మరియు ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.