Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Vs Chandrababu Naidu : గట్టి షాక్.. చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా...

CM Jagan Vs Chandrababu Naidu : గట్టి షాక్.. చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేసిన జగన్

CM Jagan Vs Chandrababu Naidu : చంద్రబాబుకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఏపీలో  కనీసం నిలువ నీడ లేకుండా చేయాలని డిసైడయ్యింది. ఆయన నివాసముంటున్న ఇంటిని అటాచ్ చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. శూలశోధన చేశారు. ఈ క్రమంలో కృష్ణా నది కరకట్టలపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అక్రమమని తేల్చారు. దానిని తొలగించేందుకు పూనుకున్నారు. అయితే అది సాధ్యం కాదని.. నిబంధనలకు విరుద్ధమని తెలిసి సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ ఉత్తర్వులు జారీచేశారు. హోంశాఖ కార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే మరుగునపడిపోయిన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గెస్ట్ హౌస్ చంద్రబాబుది కాదు. పారిశ్రామికవేత్త లింగమనేనిది. ఇప్పుడు అటాచ్ పేరుతో చంద్రబాబును ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంది. అయితే అది పైశాచిక ఆనందంగా మిగలనుంది. ఎందుకంటే జగన్ ఆస్తులను లెక్కకు మించి అటాచ్ చేశారు. కానీ వాటిని స్వాధీనం చేసుకోలేదు. అటాచ్ అంటే అది కేవలం దానిపై లావాదేవీలు నిషేధించడమే. అంతమాత్రానికి చంద్రబాబును అడ్డుకున్నామని…ఆయన అవినీతి నిరూపమైందని చెప్పడం కొంచెం అతే అవుతుంది.

మాజీ సీఎం చంద్రబాబుతో పాటు అప్పటి యాక్టివ్ మంత్రి నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేశారని.. క్విడ్ ప్రోకు పాల్పడ్డారని జగన్ సర్కారు అనుమానిస్తూ వచ్చింది. సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగం మోపారు. చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని కారణాలు చూపారు. ఇప్పుడు ఏకంగా స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అటాచ్ చేస్తూ ఉత్తర్వులివ్వడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే దీనిపై టీడీపీ శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్టవుతున్నాయి. వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ గా చెబుతున్నాయి. రేపటితో లోకేష్ యువగళం పాదయాత్రం వంద రోజులకు చేరుకుంటుంది. దీనిని పండుగగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఈ తరుణంలో డైవర్ట్ చేయడానికే చంద్రబాబు నివాసంపై పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది చంద్రబాబు గెస్ట్ హౌస్ కాదు..లింగమనేనిది.. అటువంటప్పుడు అది క్విడ్ ప్రో ఎలా అవుతుందన్నది జగన్ సర్కారుకు తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version