Jagan and Chandrababu : రెండు కీలక ఘటనలతో జనం ముందు ముద్దాయిలుగా జగన్, చంద్రబాబు

జగన్, చంద్రబాబుల తీరు..  చూస్తుంటే ఏపీలో అవినీతిమరకలేని పవన్ కళ్యాణ్ వైపు ఆంధ్రా ప్రజల చూపు చూస్తున్నారన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 5, 2023 3:26 pm

Jagan and Chandrababu : గత వారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి ఇన్ కంటాక్స్ నోటీసులు చంద్రబాబుకు అందడం ఏపీలో సంచలనమైంది. రెండోది ఎంత కష్టపడి డిఫెండ్ చేసుకుంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ఉచ్చు బిగిసింది.

చంద్రబాబు గురించి ఏమైనా చెప్పండి.. ఇన్ కం ట్యాక్స్ నిర్ధిష్టంగా చాలా దర్యాప్తు జరిపి.. చంద్రబాబు పీఏతోపాటు కార్పొరేట్ కంపెనీలందరినీ విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. ఆగస్టు నెలలో ఈ నోటీసులు ఇచ్చింది. 118 కోట్ల రూపాయలు చంద్రబాబుకు లంచంగా ఇచ్చినట్టుగా ఐటీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రమ్మని కోరింది.

చంద్రబాబు లీగల్ గా వెళ్లి రానని చెప్పినా.. ఐటీ శాఖ నోటీసులు జారీ రమ్మని చెప్పింది. చంద్రబాబు ఐటీ శాఖ వద్దకు వెళ్లి తాను నేరం చేయలేదని ఐటీ శాఖ ముందు వాదించాల్సి ఉంది. కానీ అలా చేయకపోవడంతో ప్రజల్లో అభాసుపాలయ్యారు. ఎవరో రోడ్డు సైడ్ పోయేవాళ్లు చేసిన ఆరోపణలు కావవి.. కేంద్ర ఐటీశాఖ చేసిన ఆరోపణలు చంద్రబాబుకు చాలా మైనస్ గా మారాయి.

రెండోది వైఎస్ వివేకా హత్య కేసులో అఫిడవిట్ చూస్తే చాలా స్పష్టంగా కంక్లూజన్ గా ‘ఈ హత్య భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి’లు సూత్రధారులుగా తేల్చిచెప్పింది.

రెండు కీలక ఘటనలతో జనం ముందు ముద్దాయిలుగా జగన్, చంద్రబాబుల తీరు..  చూస్తుంటే ఏపీలో అవినీతిమరకలేని పవన్ కళ్యాణ్ వైపు ఆంధ్రా ప్రజల చూపు చూస్తున్నారన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.