Chandrababu-Pawan Kalyan : చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. వైసీపీ సహజంగానే దానికి మార్పులు చేసి ట్విస్టులు చేసి చెబుతోంది. వైసీపీ సభ్యత లేని పార్టీ.. సంస్కారం లేనటువంటి పార్టీ. అంతమాత్రాన ఏదో జరిగిపోయిందని అనుకుంటే పొరపాటు.
ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. ప్రతీసారి పవన్ కళ్యాణ్ నే చంద్రబాబు ఇంటికి వెళ్లాలా? అన్న ప్రశ్న మొదలైంది. దాసరి రాము లాంటి కాపు నేత , పవన్ కు మద్దతు ఇచ్చే నేత ఇలా పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు ఊరికే వెళతారని ప్రశ్నించారు.
ఈ సమాజంలో సామాజిక సమీకరణాలు అనేవి ముఖ్యం. రాజకీయాలు దాని చుట్టే తిరుగుతున్నాయి. ఎవరికి నచ్చినా నచ్చకున్న జనసేనకు కోర్ ఓటు బ్యాంకు కాపులే. ప్రతీ పార్టీకి కోర్ ఓటుబేస్ ఉంటుంది. కాపులు ఇప్పటికీ పవన్ వెంట ఉన్నారు. వారిలో అసంతృప్తి వస్తే ఎలా ఉంటుంది. ఆ విమర్శ చూసిన తర్వాత పవన్ ఇంటికి వెళ్లాడు. కానీ చంద్రబాబు వెళ్లడం ఆలస్యమైంది. డ్యామేజ్ కంట్రోల్ గా దీన్ని అభివర్ణించవచ్చు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి సరే, ఎవరికెన్ని సీట్లు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.