Pakistan: అమెరికా దేశం భారత్ తో పాటు పాకిస్తాన్ తో కూడా స్నేహం చేసేది. అవసరమైన ఆయుధాలను సరఫరా చేసేది. కానీ ఇటీవల జరుగతున్న పరిణామాలతో అమెరికా, పాకిస్తాన్ మధ్య స్నేహం చెడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, పాక్ మధ్య బంధం తెగిపోవడానికి చైనానే కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న డెమొక్రసీ సమ్మిట్ కు హాజరు కావాలని 110 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఆహ్వానించిన వారిలో పాకిస్తాన్ దేశం ఉంది. కానీ చైనా పేరు లేదు. అయితే చైనా పాకిస్తాన్ ఈ సదస్సును బహిష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ముందు ముందు చైనా కోసం అమెరికా స్నేహాన్ని పాకిస్తాన్ వదులుకుంటుందా..? అన్న చర్చ సాగుతోంది.

ఈనెల 9,10 తేదీల్లో బైడెన్ ప్రభుత్వం 110 దేశాలతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో దక్షిణాసియా నుంచి భారత్, మాల్దీవులు, నేపాల్ తో పాటు పాకిస్తాన్, తైవాన్ లకు ఆహ్వానం అందింది. అయితే ఇందులో చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పాకిస్తాన్ కు ఆహ్వానం అందినా సమావేశాన్ని బహిష్కరించింది. అందుకు కారణం చైనాతో ఉన్న మైత్రియే కారణమని తెలుస్తోంది. చైనాను పక్కనబెట్టి తైవాన్ ను పిలవడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే జో బైడెన్ తో మాట్లాడేందుకు ముందుగా మంత్రిని హాజరుపరుస్తామని నిర్ణయించినా.. ఆ తరువాత సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. కాగా పాకిస్తాన్ సదస్సును బహిష్కరించడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ‘ ప్రజాస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. మాకు పాకిస్తాన్ అసలైన, బలమైన సోదరుడు’ అని ట్విట్ చేశారు.
అయితే పాకిస్తాన్ కు చెందిన ఇంగ్లీష్ పత్రిక ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ మరో రకంగా ప్రచురిచింది. ‘ అమెరికాతో ఉన్న పటిష్ట సంబంధాలు లేని కారణంగా సదస్సును బహిష్కరించాలని ఇస్లామాబాద్ నిర్ణయించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాకిస్తాన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఈ సదస్సుల పాల్గొనలేదు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బైడెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇది ఇరు దేశాల మధ్య దూరం పెంచిందనుకున్న తరణంలో ఆహ్వానం మరోసారి దగ్గరి చేసిందని అనుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ కు ఈ సదస్సు సౌకర్యంగా లేదు’ అని తెలిపింది.
ఈ సదస్సుకు గౌర్హాజరుపై పాకిస్తాన్ కు చెందిన దౌత్య వేత్తలు వ్యతిరేకంగా స్పందించారు. పాకిస్తాన్ జర్నలిస్టు కమ్రాన్ యూసుఫ్ ‘ సదసస్సులో పాల్గొనకపోవడం అనాలోచితం. ఇలా చేసి మనల్ని మనమే దిగజార్చుకున్నవాళ్లమవుతాం’ అని ట్వీట్ చేశారు. దీనికి భారత్ లోని పాక్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ బదులిస్తూ ‘ అమెరికా, పాక్ మధ్య సంబంధాలు ఎప్పుడో చెడిపోయాయి. అంతర్జాతీయ సంబంధాలు నెరపడం అనేది ఒక ప్రక్రియ. మనకు మనమే ఇబ్బందులు తెచ్చిపెట్టుకోం. అయితే ఈ విషయాలపై కేంద్ర దృష్టి పెట్టాల్సని అవసరం ఉంది’ అని బదులిచ్చారు.
ఆయన యూట్యూబ్ లోనూ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చైనా, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు చెడగొట్టడానికే అమెరికా పాకిస్తాన్ ను ఆహ్వానించింది. చైనా, రష్యాలను ఆహ్వానించలేదు. కానీ బంగ్లాదేశ్, టర్కీలను ఆహ్వానించకపోవడంపై మర్మమేంటి..? ‘వన్ చైనా పాలసీ’క తైవాన్ అంగీకరించినా ఆ దేశాన్ని సదస్సుకు ఎందుకు పిలిచారు..? చైనాలేని ఆ సమావేశానికి ఎలా వెళ్తాం..?’ అని వివరించారు.