CM Jagan – PM Modi : ఆంధ్ర రాజకీయాల మకిలీ మోడీకి కూడా అంటుకుంటుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మోడీ నిజాయితీపరుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ యూనివర్సల్ లో బ్లాక్ హోల్ అర్థం కావడం లేదో.. మోడీ నిజాయితీలో ఈ ఆంధ్ర బ్లాక్ హోల్ ఎవరికీ అర్తం కావడం లేదు.
కర్ణాటకలో సొంత పార్టీలో అవినీతిని ఎలాగోలా మోడీ డిఫెండ్ చేసుకున్నాడు. ఆంధ్రాలో సొంత పార్టీ కాకున్నా జగన్ ను మోడీ ఎందుకు వెనకేసుకొస్తున్నాడన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ కు మోడీ మద్దతు ఇస్తున్నాడన్నది అందరి నమ్మకం. ఆంధ్రప్రజలు, వైసీపీ నేతలు ఇదే నమ్ముతున్నారు.
జనాన్ని మనం వెర్రి వెంగళప్పల్లా చూడడానికి లేదు. వారికి రాజకీయాల్లో ఎవరి పొత్తులు, తొత్తులు, ఎత్తులు తెలుసు. 2024లో ఎవరు గెలిచినా ఎంపీ సీట్లు మోడీ ఖాతాలోకే.. ఎందుకంటే చంద్రబాబు, పవన్, జగన్ లు ఎవరు గెలిచినా మోడీకే సపోర్ట్ ఉంటుంది. అయినా జగన్ విషయంలో మోడీ బెండ్ అవుతున్నారు. ఎందుకన్నది అర్థం కావడం లేదు.
జగన్ పై ఎన్నో కేసులు, చార్జీషీట్లు ఉన్నాయి. అయినా విచారణ జరగడం లేదు. అవినాష్ రెడ్డి వ్యవహారంలోనూ జగన్ కు ఇప్పుడు మోడీ, అమిత్ షా కు మద్దతుగా కేంద్రం నిలుస్తోంది. దీనిపై అందరికీ జుగుప్సా కలుగుతోంది.
ఈ జగన్-మోడీ దోస్తీ రాజకీయం.. అవినాష్ రెడ్డి వ్యవహారంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.