MLC Elections 2023 : ఏపీ సీఎం జగన్ తాజాగా 18 ఎమ్మెల్సీ సీట్లలో 11 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేశాడని ఆయన తరుఫున మంత్రులు, నేతలు హోరెత్తిస్తున్నారు. మరి ఇది నిజమా? అన్నది మనం ఆలోచించాలి.
అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటి? పవన్ చెబుతున్నట్టు.. జనాభా దామాషా పద్ధతి ప్రకారం జగన్ కేటాయించారా? అన్నది ఆలోచించాలి. అతిపెద్ద సామాజికవర్గమైన కాపులకు న్యాయం జరిగిందా? అంటే జరగలేదు. ఈ ఎమ్మెల్సీ సీట్లలో 1 సీటు మాత్రమే జగన్ కేటాయించారు.
ఇక రెండో అతిపెద్ద సామాజికవర్గం దళితులు. వారికి ఏదో ఇచ్చారు. కాపులు ఎలాగూ తనకు ఓటు వేయరని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ఇవ్వలేదు. ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదంటే వారు ఎలాగూ తనవెంటే ఉన్నారని జగన్ వారిని విస్మరించాడని అర్థమవుతోంది.
‘సామాజిక న్యాయం, సంక్షేమం పేరుతో పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చటం సాధ్యమా?’ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.