
Cancer Symptoms: మందులేని వ్యాధిగా క్యాన్సర్ మారిపోయింది. ఇటీవల చాలా మంది దీని బారిన పడుతున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. క్యాన్సర్ బారిన పడితే మొదట్లో గుర్తిస్తే చికిత్సతో తగ్గించుకోవచ్చు. మహిళలతో పాటు పురుషులకు క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కానీ స్త్రీలకు ఎక్కువ శాతం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి మహిళలను వేధిస్తుంటాయి. ఇందులో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఒకటి. దీన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడమే ఉత్తమం.
ఎయిడ్స్ కు ఒకప్పుడు మందు లేదు. కానీ ఇప్పుడు క్యాన్సర్ కు కూడా మందు రాకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతోంది. గర్భాశయ క్యాన్సర్ 15-44 వయసుల వారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అందుకే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మానుకోవద్దు. మొదటి దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స చేయించుకుంటే ప్రమాదమేమీ ఉండదు. కానీ వ్యాధి ముదిరిన తరువాత చికిత్స చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రారంభంలోనే గుర్తించి వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడమే మంచిది.
వైద్యుల సలహాల ప్రకారం నడుచుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. లేదంటే విజృంభిస్తుంది. క్యాన్సర్ ను సులభంగా నయం చేసుకోవచ్చు. గర్భాశయ క్యాన్సర్ గురించి యశోద ఆస్పత్రికి చెంది డాక్టర్ రాజేష్ బొల్లం క్యాన్సర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. క్యాన్సర్ గురించి కీలక విషయాలు వివరించారు. దుర్వాసనతో కూడిన నీటి స్రావం వస్తే అనుమానించాలి. పీరియడ్స్ మధ్య రక్తస్రావం, రుతుక్రమం తరువాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మానుకోవద్దు.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు పాటించి చికిత్స తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. లేదంటే వ్యాధి తీవ్రత పెరిగితే ఇబ్బందులు తప్పవు. క్యాన్సర్ అంత ప్రమాకరమైనది ఏమీ కాదు. సులభంగా తగ్గించుకోవచ్చు. కానీ ముందే గుర్తించుకుంటే సరిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శస్త్ర చికిత్స లేదా రేడియేషన్ థెరపీ ద్వారా క్యాన్సర్ ను తగ్గించుకోవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ను కూడా నయం చేసుకోవచ్చు.