AP Politics : ఆంధ్రాలో బీజేపీ ఒంటరిగానా? తెలుగుదేశం-జనసేనతోనా?

సనాతనధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పవన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇవ్వాళ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా కూడా మోడీ కావాలంటున్నారు

Written By: NARESH, Updated On : October 6, 2023 5:53 pm

AP Politics : ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. దీన్ని అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే పవన్ నిస్వార్థపరుడు. నిజాయితీపరుడు. సినిమా కెరీర్ ను పక్కనపెట్టి ఏదో చేయాలనే తపనతో కోట్లు నష్టపోతున్నా.. తన కష్టార్జితంతో ప్రజలకు సొంతంగా డబ్బులు పంచుతూ ప్రజల మనసు గెలుస్తున్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపిస్తున్నారు. పవన్ ఆలోచనలు ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టే లేవు. జాతీయ భావాలు కలిగి ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏ ప్రాంతీయ పార్టీలో ఉండవు. చాలా విషయాల్లో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతారు. హిందూ ధర్మం విషయంలో కూడా అదే పద్ధతిలో అందరికంటే ముందే రియాక్ట్ అయ్యారు. ఏపీలోని విజయనగరంలో రాముడి తల తీసేస్తే మొదట ప్రశ్నించింది పవన్.

సనాతనధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పవన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇవ్వాళ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా కూడా మోడీ కావాలంటున్నారు. మోడీ నాయకత్వం దేశానికి అవసరం అంటున్నాడు. బీజేపీని కలిపి పోటీచేస్తానంటున్నాడు.

పవన్ కళ్యాణ్ పొత్తులు, వ్యూహాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి.