Dry Fruits: చక్కెర నిల్వలు తక్కువగా ఉండే 3 రకాల ఈ డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసా?

పండుగల సందర్భంగా ఇంట్లో చేసుకునే రుచికరమైన పదార్థాల్లో బాదంపప్పు తప్పకుండా ఉండేలా చూస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీరో కొలెస్ట్రాల్ ఉండే జుట్టు, చర్మం, దంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : October 6, 2023 5:17 pm

Dry Fruits

Follow us on

Dry Fruits: శ్రావణమాసం తర్వాత వరుసగా పండుగలు వస్తాయి. ఈ క్రమంలో స్వీట్ ఫుడ్ ఎక్కువగా చేస్తారు. అయితే డయాబెటిస్ తో పాటు ఇతరులు స్వీట్ పదార్థాలు ఎక్కువగా తినాలని ఆశపడతారు. అయితే వైద్యుల సలహా మేరకు తక్కువ షుగర్స్ ఉండే పదార్థాలను తీసుకోవచ్చు. అసలు షుగర్ లెవెల్స్ ఎందులో తక్కువగా ఉంటాయి? ఎలాంటి పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి? మార్కెట్లో దొరికే ఈ డ్రై ఫ్రూట్స్ చాలా నయం అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బాదం:
పండుగల సందర్భంగా ఇంట్లో చేసుకునే రుచికరమైన పదార్థాల్లో బాదంపప్పు తప్పకుండా ఉండేలా చూస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీరో కొలెస్ట్రాల్ ఉండే జుట్టు, చర్మం, దంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మలబద్ధకం, శ్వాసకోశ సమస్యల నుంచి, గుండె రుగ్మతల నుంచి కాపాడుతుంది. బాదంపప్పుల్లో చక్కెర తక్కుగా ఉంటుంది. దీంతో వీటిని ఆహార పదార్థాలు వేసుకొని తినొచ్చు.

వాల్ నట్స్:
వాల్ నట్స్ లో ఓమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటిమిన్లు అధికంగా ఉండే ఇవి తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన ఇ ఎక్కువగా ఉంటుంది. ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడుకు పదును పెట్టే పదార్థాల్లో వాల్ నట్స్ ఒకటి. అందుకే దీనిని బ్రెయిన్ పుడ్స్ అని అంటారు.

పిస్తాపప్పులు:
పిస్తాపప్పుల్లోనూ చక్కెర నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని అధికంగా పెంచుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండెకు మేలు కలుగుతాయి. అంతేకాకుకండా పండుగల సమయంలో పిస్తాను అధికంగా వేస్తారు. పిస్తాతో ప్రత్యేకంగా కొన్ని పదార్థాలు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది.