ipl auction 2022: క్రికెట్ ప్రియులకు మరో పండుగ అందిచనున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. మొన్నటి వరకు సౌతాఫ్రికా టూర్.. అండర్ 19 క్రికెట్ ప్రపంచంలో మునిగిన క్రీడాభిమానులు ఇప్పుడు మరో సందడి చేయనున్నారు. నేడు ఐపీఎల్ వేలం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలపడంతో క్రీడా ప్రపంచంలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరికి మెగా ఈవెంట్ చూపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్లో ఐపీఎల్ యాక్షన్ నిర్వహించేందుకే ఏర్పాటు రెడీ చేశారు. ఈ దపా వేలం పాటలో 10 ప్రాంఛైజీలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ వేలం పాటలో ఏ క్రికెటర్ ఎంత దక్కించుకుంటారోనని క్రీడా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ కు సంబంధించిన వేలం శనివారం సిలికాన్ సిటీ బెంగుళూరులో నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ వేలం పాట మొదలు కానుంది. అయితే ఆదివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దఫాలుగా వేలం నిర్వహించి ఆటగాళ్లను ప్రాంఛైజీలు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న ఫ్రాంచైజీలతో పాటు కొత్తగా ‘లక్నో సూపర్ జెయింట్స్’, ‘గుజరాత్ టైటాన్స్’ ఇందులో చేరాయి. ఇక పాత ప్రాంఛైజీలు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటేల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరులు వేలం పాటకు హాజరు కానున్నాయి.
ఇప్పటి వరకు 14 ఏడిషన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ లో గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఈ కప్ ఆ టీంకు నాలుగోది. ధోని కెప్టెన్ గా నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అయితే ఈసారి కొత్తగా వచ్చిన జట్లు ఏ విధంగా పర్ఫామెన్స్ చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 10 జట్లు 59 మంది ఆటగాళ్లను సెలెక్టు చేసుకోనున్నారు. ఇది మార్క్యూ ప్లేయర్ లతో ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంఛైజీలు కొంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 72 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే సన్ రైజర్స్ రూ.68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.62 కోట్లు, లక్నో జట్టు రూ.59 కోట్లు, అహ్మదాబాద్ రూ.52 కోట్లతో వేలానికి దిగే అవకాశం ఉంది. ఇక చెన్నై, కోల్ కతా, ముంబై జట్లు రూ.48 కోట్ల తో రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయితే మిగతా జట్లతో పోలిస్తే ఢిల్లీ అత్యల్ప:గా రూ.47.50 కోట్లతో బరిలోకి దిగనుంది.
ఐపీఎల్ వేలం శనివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఈ వేలానికి 161 మంది క్రీడాకారులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం నిర్వహించే వేలానికి మరికొంత మంది రావచ్చని అంటున్నారు. రిటైనింగ్ పాలసిని ఇంప్లిమెంట్ చేయడంతో వేలానికి ఒక్కో జట్టులో కొత్త ముఖాలు కనిపించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రతీ ఒక్క ఆటగాడు రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలో పాల్గొననున్నారు. వీరిలో అశ్విన్, శిఖర్ ధావన్, శ్రేయాస్, అయ్యర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.15 కోట్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మిగతా రోహిత్, ధోని ఇతర క్రీడాకారులు ఎంత వేలానికి ప్రాంచైజీలు దక్కించుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వేలం పాట కార్యక్రమంలో సంజయ్ ముంజ్రేకర్, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, కామెంటర్లుగా వ్యవహరించనున్నారు. సో.. క్రికెట్ వేలం పాటను వీక్షించేందుకు మీరు కూడా రెడీగా ఉండండి..