BJP vs TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నిన ఉచ్చులో బీజేపీ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఫలితంగా పీఎం నరేంద్ర మోడీ డైలమాలో పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీని కిందకు నెట్టేసింది. దీంతో బీజేపీ నేతలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్న బీజేపీ ప్రధాని మాటలతో ఆలోచనలో పడింది.

రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలని టీఆర్ఎస్ కు ప్రధాని ప్రసంగం ఓ టానిక్ లా దొరికింది. దీంతో ఆయన తెలంగాణ వ్యతిరేకి అని చూపేందుకు ప్రయత్నించింది. రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారాన్ని పక్కన పెట్టేందుకు ప్రధాని మాటలు వారికి మంచి పట్టును తెచ్చిపెట్టాయి. లేకపోతే కేసీఆర్ పై వచ్చిన అప్రతిష్టను రూపుమాపుకునే క్రమంలో ప్రధాని మాటలను సాకుగా చూపి తప్పించుకుంది.

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా గల పార్టీగా బీజేపీ భావిస్తున్న తరుణంలో కేసీఆర్ కూడా దాన్ని ఎదగనీయకుండా చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో జతకట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు లో స్టాలిన్, బిహార్ నేత తేజస్వి యాదవ్ తదితరులను కలిసి మూడో కూటమి ఏర్పాటు ప్రాధాన్యం గురించి చర్చించి కలిసి రావాలని కోరారు.

దీంతో రాబోయే రోజుల్లో బీజేపీ యేతర ప్రభుత్వం కోసం పటిష్టంగా పోరాడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీకి కనీసం స్వాగతం చెప్పేందుకు కూడా రాకుండా ఆయనపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసి బీజేపీకి సవాలు విసిరారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ నిర్వాకంపై బీజేపీ నేతలు విమర్శలు చేసినా పట్టించుకోవలేదు. దీంతో ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధమే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీపై వ్యతిరేకతను ప్రజలకు ఎక్కించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారా?
మరో ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో అన్ని యుక్తులు ప్రదర్శించి బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో కేసీఆర్ కూడా డైలమాలో పడ్డారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష పోరుకే సిద్ధమయ్యారు. అప్పటి నుంచే బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నది సత్యమే.
కానీ కేసీఆర్ మాత్రం తన ప్రయత్నాలు వీడటం లేదు. బీజేపీని అన్ని దారుల్లో అడ్డుకోవాలనే చూస్తున్నారు. ప్రధాని ప్రసంగం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని చెబుతూ విమర్శలకు దిగింది. నరేంద్ర మోడీకి తెలంగాణ రావడం ఇష్టం లేదని ప్రచారం చేస్తూ బీజేపీని ఇబ్బందులకు గురి చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి బీజేపీని నిలువరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: టీఆర్ఎస్ నేతలకు ప్రజాప్రయోజనాలు పట్టవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూటి ప్రశ్న