Nitin Wife: సినీ ఇండస్ట్రీలో కుల, మతాల పట్టింపులు తక్కువే. నచ్చిన హీరోను, హీరోయిన్ ను పెళ్లిచేసేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన‘అపోలో’ హాస్పిటల్స్ అధినేత మనవరాలు ఉపాసనను అలాగే పెళ్లి చేసుకున్నారు. ఇక ఇతడే కాదు.. చాలా మంది ప్రముఖులు అలాగే ప్రేమపెళ్లిల్లు చేసుకున్నారు.

ఇటీవలే మోస్ట్ బ్యాచ్ లర్ గా ఉంటున్న హీరో నితిన్ కూడా పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోలంతో ఒకసారి ఆగిన పెళ్లి ఇక ముహూర్తాలు లేవని తప్పనిసరి పరిస్థితుల్లో చేసేసుకున్నాడు. గత జులై 26న నితిన్ పెళ్లి కొద్ది మంది సమక్షంలోనే జరిగింది. నితిన్ భార్య పేరు షాలినీ.. వీరిది పరిచయంతో మొదలైన ప్రేమ పెళ్లి కావడం విశేషం.
‘ఇష్క్’ సినిమా టైంలో నితిన్, షాలినీలకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకూ వెళ్లింది.
అయితే నితిన్ భార్య షాలినీ కుటుంబానికి.. అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందట.. షాలినీ తల్లిదండ్రులు సంపత్-షేక్ నూర్జహాన్ నాగర్ లది కూడా ప్రేమ పెళ్లి కావడం విశేషం. వీరిద్దరూ కర్నూలులో ఫేమస్ డాక్టర్లుగా ఉన్నారు. 20 ఏళ్లుగా అక్కడ ప్రగతి నర్సింగ్ హోంను నిర్వహిస్తున్నారు.
విశేషం ఏంటంటే.. షాలినీ తల్లి నూర్జహాన్ నాగర్ కు చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుఫున కర్నూలు జిల్లా నియోజకవర్గం నుంచి నాగర్ నిలబెట్టారు చిరంజీవి. కానీ నగర్ ఓటమి పాలయ్యారు. తరువాత ఈమె కూడా రాజకీయాలకు దూరమయ్యారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికీ చిరంజీవితో సంపత్-నూర్జహాన్ దంపతులకు స్నేహం ఉందట.. అలా నితిన్ భార్యకు చిరంజీవికి ప్రత్యేక అనుబందం ఉంది.

[…] Also Read: చిరంజీవికి, నితిన్ భార్య కుటుంబానికి… […]