PM Modi – US drone deal : అమెరికా డ్రోన్ల కొనుగోలుపై రచ్చ అంతర్జాతీయ కుట్రలో భాగమా?

భారత ప్రభుత్వం యాక్సెప్టెన్సీ లెటర్ ఇచ్చింది. నాటో యేతర దేశాలకు ఇంతటి అడ్వాన్స్ డ్రోన్లు ఇవ్వాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. వాళ్లు భారత్ కు ఇవ్వొద్దు అంటే ఇక మనకు అమ్మరు. ఆ తర్వాతే ఒప్పందాలు జరుగుతాయి. దీనంతటికి ఇంత తతంగం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ బట్టలు చింపుకుంటోంది.

Written By: NARESH, Updated On : June 29, 2023 6:41 pm
Follow us on

PM Modi – US drone deal : ప్రధాని నరేంద్రమోడీ అమెరికా యాత్రతో భారత్ ప్రతిష్ట చాలా పెరిగింది. మోడీ పాపులారిటీ పెరిగింది. మోడీ ప్రపంచ నాయకుడు అయ్యాడు. భారత్ ఎవరూ విస్మరించలేని స్థాయికి ఎదిగింది. దీన్ని కొంతమంది భరించలేకపోతున్నారు.

నిన్నటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న రచ్చ చేస్తుంటే.. అమెరికా నుంచి మిలటరీ డ్రోన్లు కొనాలని భారత్ భావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రోన్లు. అమెరికా వద్దే ఈ టెక్నాలజీ ఉంది. భారత్ నేవి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ డ్రోన్లు కావాలని అడుగుతున్నారు. అయితే భారత్ తో అమెరికా సంబంధాలు సరిగా లేక డీల్ ఒప్పందం జరగలేదు. అమెరికా ఎక్కడా ఒప్పందం జరిగినట్టు చెప్పలేదు. 31 డ్రోన్లు అమ్మడానికి సిద్ధపడ్డట్టు అమెరికా చెప్పింది.

భారత ప్రభుత్వం యాక్సెప్టెన్సీ లెటర్ ఇచ్చింది. నాటో యేతర దేశాలకు ఇంతటి అడ్వాన్స్ డ్రోన్లు ఇవ్వాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. వాళ్లు భారత్ కు ఇవ్వొద్దు అంటే ఇక మనకు అమ్మరు. ఆ తర్వాతే ఒప్పందాలు జరుగుతాయి. దీనంతటికి ఇంత తతంగం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ బట్టలు చింపుకుంటోంది.

అమెరికా డ్రోన్ల కొనుగోలుపై రచ్చ అంతర్జాతీయ కుట్రలో భాగమా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.