Etela Rajender- KTR: ఎవరు ఏమనుకున్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుడి భుజంగా వ్యవహరించిన వ్యక్తి ఈటల రాజేందర్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ల మంత్రిగా పనిచేశారు.. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చారు.. భారతీయ జనతా పార్టీలో చేరారు.. హుజురాబాద్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు.. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాస్త కూస్తో ఎదిగింది అంటే దానికి కారణమయ్యారు.. సరే ఇదంతా వదిలేస్తే… ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పై విమర్శలు చేస్తున్నారు.. ఈసారి కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడ పోటీ చేస్తానని సవాల్ విసురుతున్నారు.. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈటల రాజేందర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. ఈసారి హుజూరాబాద్ లో ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేయాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే ఇటీవల మంత్రి కేటీఆర్ జమ్మికుంటలో పర్యటించినట్టు తెలుస్తోంది.

శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లాబీలో కేటీఆర్ విపక్ష సభ్యులందరినీ పలకరించారు.. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో రెండుసార్లు ప్రత్యేకంగా మాటామంతి జరిపారు.. ఇక వీరి మధ్య జమ్మికుంటలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.. అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదు అని కేటీఆర్ ఈటల రాజేందర్ ను ప్రశ్నించగా.. పిలిస్తే కదా హాజరయ్యేది అని ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగాలేదని ఈడిల రాజేందర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తో అన్నట్టు సమాచారం.. కాగా ఆ సమయంలో ఈటల రాజేందర్ వెనకాల ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఎంట్రీ అయ్యి… ఈటల నెత్తి నిమృతం కనిపించారు.. ఇక కేటీఆర్ రాకతో మరో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు లేచి నిలబడేందుకు ప్రయత్నించగా… కేటీఆర్ ఆయనను కూర్చోబెట్టి ఈటల తో కాసేపు మాట్లాడారు.. ఈ క్రమంలో గవర్నర్ సభలోకి వస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమాచారం ఇవ్వడంతో కేటీఆర్ ఈటెల మధ్య మాట మంతీ ముగిసింది.

ఈటెల, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరగడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.. గతంలో భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ ను కేటీఆర్ ఆప్యాయంగా అన్నా అని పిలిచేవారు.. ఆ మధ్య కేసీఆర్ కు, ఈటెల రాజేందర్ కు భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు కేటీఆర్ సంధానకర్త పాత్ర పోషించారు.. అప్పటికి పూడ్చలేని అగాధం ఏర్పడటంతో కేటీఆర్ ఎంత చేసినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.. ఈటల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే కేటీఆర్ హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని ఆయన వర్గీయులు అంటూ ఉంటారు.. మన జమ్మికుంటలో కూడా ఈటల రాజేందర్ ప్రస్తావన ఒకటి రెండు సార్లు మాత్రమే కేటీఆర్ తీసుకొచ్చారు.. అయితే కేటీఆర్ స్వయంగా రాజేందర్ దగ్గరికి వెళ్లడం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. త్వరలో ఆయన భారత రాష్ట్ర సమితిలోకి వెళ్తారని కొందరు… అంత అవమానం జరిగిన తర్వాత మళ్లీ ఎందుకు వెళ్తారని కొందరు చర్చించుకుంటున్నారు.. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటామంతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.