Independence Day 2023: ప్రస్తుతం మనుషులను వేరు చేసేది కులం అయితే మనసులను ఒక్కటి చేసేది దేశం. మన అందరి అణువణువూ ప్రవహించేది రక్తం… కానీ మనందరి రక్తం రంగు ఒక్కటే… అదే భారతీయం. దేశం తర్వాత మళ్ళీ మనల్ని ఒక్కటి చేసింది సినిమా! ఇక దేశం, సినిమా ఒకటి అయితే. అనగా సినిమాలే దేశభక్తి పైన వస్తే మనం ఆదరించకుండా ఉంటామా..?? దేశభక్తి అనే ఎమోషన్ కు అందరిని థియేటర్లకు రప్పించే శక్తి ఉంది.
ఈ సినిమాలకు భాషాభేదాలు, మాస్, క్లాస్ విభజనలతో సంబంధం ఉండదు. మరి అలా మన దేశాన్ని షేర్ చేసిన దేశభక్తి సినిమాలను మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చూద్దాము..
ఆర్ఆర్ఆర్
అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఫిదా చేసిన దేశభక్తి సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్,రామ్‌చరణ్ హీరోలుగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ చారిత్రక చిత్రం ఆస్కార్ సైతం సంపాదించుకుంది. ఇద్దరు పోరాటయోధులు కలిసి బ్రిటీష్ వారిపై చేసిన పోరాటాన్ని హీరోయిజం, ఎమోషన్స్ మేళవించి శక్తివంతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.
మేజర్
ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన ఎన్ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా దేశభక్తి ప్రధాన కథాంశంతో తెరకేకిన సినిమా మేజర్. అడివిశేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు
భారతీయుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా,, అకాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.
ఖడ్గం
ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే వస్తుంది అంతే తెలుగు ఛానల్ లో తప్పకుండా వేసే సినిమా ఖడ్గం.1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రం చూస్తున్నంత సేపు మనల్ని ఒక దేశభక్తి ట్రాన్స్లోకి తీసుకెళ్లి పోతుంది ఈ చిత్రం.
ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినవిప్లవకారుడు భగత్ సింగ్ గురించి ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో భగత్ సింగ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ నటించారు.
గదర్- ఏక్ ప్రేమ్ కథ
విభజన, హిందూ-ముస్లిం అల్లర్ల సమయంలో జరిగిన ప్రేమకథ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.