Govinda Govinda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాతో తనకంటూ డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే.ఆయన చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకోవడంతో పాటు ఆయన ఒక స్టార్ డైరెక్టర్ గా కూడా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు గుర్తింపు పొందాడు. అప్పట్లో వరుసగా సక్సెస్ లు కొడుతూ ఎవరికి సాధ్యం కాని విధంగా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక శివ సినిమా తర్వాత నాగార్జునతో ఆయన గోవిందా గోవిందా అనే సినిమా చేశాడు అయితే ఈ సినిమాకి కథ కొమ్మనపల్లి అనే రైటర్ ఆర్జీవీ తో కలిసి ఈ సినిమాకి కథ అందించడం జరిగింది.ఈ సినిమా టైంలో వర్మ ఈ సినిమాని ఎలా చేయాలి అనే దాని మీద విపరీతమైన ఎనాలసిస్ లు చేస్తూ ఉండేవాడట. ఒక సీన్ పర్ఫెక్ట్ గా చేయడానికి ఆయన ఎంతైనా సరే రిస్క్ తీసుకొని ఆ సీన్ల లో ఇన్వాల్వ్ అయి ఆర్టిస్టుల చేత చేయిస్తూ ఉండేవాడు అలా ఈ సినిమా నాగార్జున ఆర్జీవీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది.
అయితే ఈ సినిమా టైటిల్ వెనక ఉన్న రహస్యాన్ని ఈ సినిమా రైటర్ అయిన కొమ్మనపల్లి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా వెంకటేశ్వర స్వామి మీద స్టోరీ తో నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి ముందుగా వెంకటేశ్వర స్వామి మహత్యం అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దాం అని అందరూ అనుకున్నారు కానీ ఎందుకో వర్మకి ఈ టైటిల్ అంతగా నచ్చలేదు. దాంతో డిఫరెంట్ గా టైటిల్ ని అరేంజ్ చేయాలి అనుకొని టైటిల్స్ కోసం కొద్ది రోజులు వెతికాడట. ఆయనకు టైటిల్ దొరకకపోవడంతో గోవిందా గోవిందా అనే టైటిల్ బాగుంది అని తనతో పాటు ఆ సినిమాకి రైటర్ గా వ్యవహరించిన కొమ్మనపల్లి గారితో ఆర్జీవి చెప్పాడంట. బాగుంది కానీ ఇది చనిపోయినప్పుడు శవాన్ని తీసుకెళ్లే టైంలో ఇలా గోవిందా గోవిందా అంటూ తీసుకెళ్తారు.
మన దేవుడు సినిమాకి ఇలా టైటిల్ పెట్టడం అనేది కొంతవరకు మైనస్ అవుతుందేమో అని కొమ్మనపల్లి గారు ఆర్జీవీ తో ఒక మాట చెప్పాడట. దాంతో ఆర్జీవి చనిపోయినప్పుడు అలా అంటారా అయితే ఇదే టైటిల్ మనం ఫిక్స్ చేద్దాం అని కావాలని అదే టైటిల్ ని పెట్టారు…
ప్రస్తుతం ఆర్జీవీ ఆయనకి నచ్చిన సినిమాలు చేస్తూ తనకు నచ్చినట్టుగా ఉంటూ తన లైఫ్ స్టైల్ సపరేటు అంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు, అలాగే అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు…