మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు దీపారాధన చేసిన ఆ భగవంతుని స్మరించుకోవడం ఒక ఆచారంగా పాటిస్తాము.ఈ విధంగా కొందరు వారి ఇష్టదైవానికి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ పూజలు చేసేటప్పుడు పూజగది ఎంతో శుభ్రంగా అలంకరించుకుని పూజ చేయడం మనం చూస్తూనే ఉంటాము. అయితే పూజ చేసే సమయంలో సాధారణంగా మనం దూదితో తయారు చేసిన ఒత్తులతో ఉపయోగిస్తుంటాము. కానీ వివిధ రకాల ఒత్తులతో స్వామి వారిని పూజించడం వల్ల వివిధ రకాల ఫలితాలను పొందవచ్చు. ఏ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం….
నిత్యం మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎక్కువగా దూదితో తయారు చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తుంటారు. ఈ విధంగా చేయటం వల్ల పితృదేవతలు సంతోషపడి వారికి ఉన్న దోషాలు సైతం తొలగిపోతాయి. తామర తూడలతో తయారుచేసిన ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
చాలామందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంతానం ఉండదు. ఈ విధంగా సంతానం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. ఆ విధంగా పూజలు చేసే సమయంలో అరటి నారతో తయారు చేసిన ఒత్తులతో పూజ చేయడం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొన్ని సార్లు మన ఇంటి పై దుష్టశక్తుల పీడ కలుగుతుంది. అలాంటి దుష్టశక్తుల పీడ తొలగిపోవాలంటే జిల్లేడు ఒత్తులతో వినాయకుడిని పూజించాలి. తరుచూ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కలుగుతుంటే అలాంటి వారు కుంకుమ నీటిలో తడిపిన బట్టతో తయారు చేసిన
ఒత్తులతో దీపారాధన చేయడంవల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది.