Indigo – Mumbai airport : ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ కొరడా ఝళిపించింది. ఇందుకు బాధ్యులైన ఇండిగో సంస్థకు రూ.1.20 కోట్లు, ముంబై విమానాశ్రయ నిర్వహణ సంస్థకు రూ.90 లక్షల జరిమానా విధించింది. రన్‌వేపై ప్రయాణికులు ఆహారం తినే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. వీటితోపాటు ఎయిర్ ఇండియా, స్సైస్ జెట్ సంస్థలకు కూడా జరిమానా విధించింది.
విమానం ఆసల్యంపై నిరసన..
పొగమంచు కారణంగా నాలుగు రోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిని ఎయిర్‌లైన్స్ అధికారులు క్రమబద్ధీకరించేందుకు యత్నిస్తుండగా, ఇండిగో ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో హడావుడిగా బయటకు వచ్చి రన్‌వేపై కూర్చుని నిరసన తెలిపారు. అక్కడే ఆహారం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భద్రత విషయంలో నిర్లక్ష్యం..
విమానాలతోపాటు, విమానాశ్రయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ ఘటనను అడ్డుకోవడంతో ఇటు ఇండిగో సంస్థ గానీ, అటు మిమానాశ్రయ నిర్వహణ సంస్థ గానీ చురుగ్గా వ్యవహరించలేదని విమానయాన మంత్రిత్వ శాఖ భావించింది. ఈమేరకు రెండింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వివరణ ఇచ్చిన ఇండిగో ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. దీనికి సంతృప్తి చెందని విమానయాన శాఖ నిర్లక్ష్యానికి రూ.1.20 కోట్ల జరిమానా విధించింది. అదే విధంగా ముంబై విమానాశ్రయ నిర్వహణ సంస్థకు కూడా రూ.90 లక్షల ఫైన్ వేసింది.
ఏం జరిగిందంటే..
ఇండిగో విమానం 6ఈ2195 ఆదివారం రాత్రి 11.21 గంటలకు పొగ మంచు కారణంగా ముంబై విమానాశ్రయంలోకి రాకుండా మళ్లించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చి నిరసన తెలిపారు. అక్కడే ఆహారం తీసుకున్నారు. విమానానికి కాంటాక్ట్ స్టాండ్‌కు బదులుగా రిమోట్ బే ఇ–33 కేటాయించారు. ఇది కేటాయించిన బోర్డింగ్ గేట్ నుండి విమానంలో ప్రయాణించడానికి మరియు తిరిగి రావడానికి అనువుగా ఉండే ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్. ఇది ప్రయాణీకుల కష్టాలను మరింత పెంచింది. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Indigo rs 1 20 crore mumbai airport rs 90 lakh fine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com