ODI World Cup 2023 : ఇండియా ఆల్ టైం వరల్డ్ కప్ టీం ప్లేయింగ్ 11 ఇదే…

ఒక బెస్ట్ వరల్డ్ కప్ టీం ని ప్రకటించమంటే మనలో ఒక్కొక్కక్కరు ఒక్కో సెపరేట్ ప్లేయింట్ 11 ని రెడీ చేస్తారు...ఇక దాని ప్రకారమే మనం కూడా వరల్డ్ కప్ కు ఒక ఆల్ టైం ప్లేయింగ్ లెవెన్ టీంని

Written By: NARESH, Updated On : September 20, 2023 8:55 pm
Follow us on

ODI World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా ఇంకో పది రోజుల్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా కొంత మంది ఆల్ టైం ఇండియా వరల్డ్ కప్ టీం ని ప్రకటిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇండియా రెండు వరల్డ్ కప్ లను సాధించింది. అందులో ఒకటి కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్న టైం లో వస్తే.. మరొకటి మాత్రం ధోని కెప్టెన్సీ లో వచ్చింది. ఇక ఇప్పటి వరకు ఇండియా టీంలో ఆడిన ప్రతి ప్లేయర్ ని తీసుకొని అందులో ఒక బెస్ట్ వరల్డ్ కప్ టీం ని ప్రకటించమంటే మనలో ఒక్కొక్కక్కరు ఒక్కో సెపరేట్ ప్లేయింట్ 11 ని రెడీ చేస్తారు…ఇక దాని ప్రకారమే మనం కూడా వరల్డ్ కప్ కు ఒక ఆల్ టైం ప్లేయింగ్ లెవెన్ టీంని ఎంపిక చేయాలంటే ఎవరెవరు ఉంటారో చూద్దాం

ఆల్ టైం వరల్డ్ కప్ టీంని కనక ఒకసారి మనం చూసుకుంటే ఈ టీంలో ఓపెనర్లు గా సచిన్ టెండూల్కర్ తో పాటు రోహిత్ శర్మ ని తీసుకుందాం…ఎందుకంటే సచిన్ కి వరల్డ్ కప్ లో ఎంతమంచి రికార్డు అయితే ఉందో రోహిత్ శర్మ కి కూడా అంతే మంచి రికార్డు ఉంది. బేసిగ్గా సచిన్ ఒక లెజండరీ క్రికెటర్ అందులోనూ ఆయన ఎంటైర్ క్రికెట్ కెరియర్ లో ఆరు సార్లు వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ గా చరిత్రలో నిలిచాడు. ఇక తన కెరియర్ లో ఒక్కసారి మాత్రమే వరల్డ్ కప్ సాధించిన టీంలో ప్లేయర్ గా నిలిచాడు…

ఇక రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే అయన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ లో ఒక డీసెంట్ ప్లేయర్ గా తనదైన గుర్తింపు పొందాడు…ఇక సచిన్ తో పాటు ఓపెనింగ్ చేయడానికి ఆయన ఒక సూపర్ ప్లేయర్ అనే చెప్పాలి.రోహిత్ మాత్రమే ఓపెనింగ్ కి చాలా బాగా హెల్ప్ అవుతాడు…

ఇక నెంబర్ త్రి లో మన ఆల్ టైం ఫేవరేట్ బ్యాట్స్ మెన్ అయినా కింగ్ కోహ్లీ ని తీసుకుంటాం. ఎందుకంటే కోహ్లీ తన అగ్రెసివ్ బ్యాటింగ్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ వరల్డ్ కప్ లో చాలా మంచి పెర్ఫామెన్స్ అయితే ఇస్తాడు…కాబట్టి నెంబర్ త్రీ ప్లేస్ కి ఆయనే కరెక్ట్…

ఇక నెంబర్ ఫోర్ ప్లేస్ లో యువరాజ్ సింగ్ ని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయనకి వరల్డ్ కప్ లో మంచి రికార్డు లు ఉన్నాయి… 2011 లో ఇండియా కి వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నిజానికి ఇండియా కి ఆ వరల్డ్ కప్ రావడానికి చాలా కీలక పాత్ర పోషించాడు…ఒక పక్క ఆయనకి ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా ఇండియా కి వరల్డ్ కప్ అందించడమే లక్ష్యం గా పెట్టుకొని మరి తన బ్యాట్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడి వాళ్ళకి చుక్కలు చూపించాడు…కాబట్టి మన ఆల్ టైం ఫేవరేట్ టీముల్లో యువరాజ్ నెంబర్ ఫోర్ లో ఆడడమే కరెక్ట్…

ఇక నెంబర్ ఫైవ్ లో మాత్రం ఇండియా కి ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ని తీసుకోవడం జరిగింది.కపిల్ దేవ్ అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను ఆల్ రౌండర్ గా టీం కి ఎనలేని సేవలు అందించాడు. కాబట్టి ఆయన్ని ఈ టీం లోకి తీసుకోవడం జరిగింది…

ఇక నెంబర్ 6 పొజిషన్ లో ఇండియన్ మాజీ కెప్టెన్ అయినా గంగూలీ ని తీసుకోవడం జరిగింది. గంగూలీ కి కూడా వరల్డ్ కప్ లో మంచి రికార్డు ఉంది…బ్యాటింగ్ లో సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూనే, ఆయన వరల్డ్ కప్ లో బౌలింగ్ చేసి చాలా వికెట్లు కూడా తీసాడు…

ఇక నెంబర్ సెవన్ లో ఇండియా కి రెండో వరల్డ్ కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ఈయన వికెట్ కీపర్ గా అలాగే ఒక మంచి హిట్టర్ గా కూడా ఇండియా టీం కి చాలా మంచి సేవలు అందించాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ టీం కి ఈయనే కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తాడు…

ఇక నెంబర్ ఎయిట్ లో అనిల్ కుంబ్లే ని తీసుకోవాలి. ఎందుకంటే ఈయన ఆడిన వరల్డ్ కప్ ల్లో ఇప్పటి వరకు ఇండియా లోనే అందరి స్పిన్నర్ల కంటే కూడా ఎక్కువ వికెట్లు తీసాడు. అందుకే ఈయన పేరు ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది…

ఇక నెంబర్ నైన్ లో ఇర్ఫాన్ పఠాన్ ని తీసుకోవడం జరిగింది…పఠాన్ అటు బ్యాటింగ్ లొను, ఇటు బౌలింగ్ లోను ఆల్ అరౌండర్ గా ఉపయోగపడుతాడు…అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ కూడా చాలా బాగా వేసి స్కోర్ ఎక్కువగా ఇవ్వకుండా కట్టడి చేస్తాడు కాబట్టి ఆయన్ని తీసుకున్నాం…

ఇక నెంబర్ టెన్త్ పొజిషన్ లో ఆడే ప్లేయర్ జహీర్ ఖాన్… ఇప్పటి వరకు ఇండియన్ బౌలర్లలో ఎవ్వరు కూడా వరల్డ్ కప్ లో వికెట్లు తియ్యని విధంగా జహీర్ ఖాన్ 40 కి పైన వికెట్లు తీసి ఇండియా టీం కి మంచి విజయాల్ని అందించాడు…జహీర్ ఖాన్ ఇండియా లోనే కాదు టోటల్ వరల్డ్ లో కూడా చాలా మంచి బౌలర్…

ఇక చివరగా నెంబర్ లెవెన్ ప్లేస్ లో జవగల్ శ్రీనాథ్ ని తీసుకోవడం చాలా వరకు కరెక్ట్… శ్రీనాథ్ తన బౌలింగ్ మాయాజాలం తో వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు చాలా వికెట్లు తీసి జహీర్ ఖాన్ తర్వాత వరల్డ్ కప్ లో ఎక్కువగా వికెట్లు తీసిన ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…