IND vs NZ : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీమ్ ల మధ్య జరిగిన మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ టీమ్ లో రచిన్ రవీంద్ర 75 పరుగులు చేయగా,మిచెల్ మాత్రం 130 రన్స్ చేశాడు. ఇక అందులో భాగంగానే ఇండియా 274 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీం ఓపెనర్లు అయిన శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ మొదటి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఈ క్రమంలో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఫెర్గుసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.ఇక అలాగే 26 పరుగులు చేసిన గిల్ కూడా ఫెర్గుసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక దీనికి తగ్గట్టుగానే క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కలిసి టీమ్ స్కోర్ ని చక్కదిద్దే పనిలో పడ్డారు.
ఇక ఇలాంటి క్రమంలో శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక అంతలోకే క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియన్ టీం కి అద్భుతమైన పరుగులను చేస్తూ ఇండియన్ టీమ్ కి ఒక గొప్ప విజయాన్ని అందించడం లో వాళ్ళు గొప్ప పాత్ర ని పోషించారు.ఇక వీళ్లిద్దరూ కలిసి 60 రన్స్ చేసి అద్భుతమైన పత్నార్ షిప్ ని నెలకొల్పారు.ఇక ఈ టైం లో 27 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఎల్ బి డబ్ల్యు గా ఔట్ అయ్యాడు.
దాంతో క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ వచ్చిన అవకాశాన్ని మళ్లీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆయన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల రనౌట్ అయి వెనుదిరిగాడు. ఇక ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా కోహ్లీతో కలిసి మ్యాచ్ బాధ్యతలు మోస్తూ ఇద్దరు కలిసి మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చారు. ఇక ఈ విజయంతో ఇండియా వరుసగా ఐదు విజయాలను సొంత చేసుకుంది ఇక వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ ఈ ఓటమితో వరల్డ్ కప్ లో తన మొదటి ఓటమిని చవి చూసింది.
ఇక ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా గాయపడడంతో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. ఏకంగా 5 వికెట్లు తీసి 350 పరుగులు చేస్తుందనుకున్న న్యూజిలాండ్ ను 300 లోపే కట్టడి చేశాడు. టీమిండియా విజయానికి బాటలు వేశాడు. అందుకే అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఇక న్యూజిలాండ్ టీమ్ వరుస విజయాలకు చెక్ పెడుతూ ఇండియా న్యూజిలాండ్ టీంకి పెద్ద షాక్ ఇచ్చింది…. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. సెంచరీ చేసి తన వన్డేల్లో 49 వ సెంచరీ పూర్తి చేస్తాడు అని అనుకున్న అభిమానులకి కోహ్లీ నిరాశని కలిగిస్తూ ఆయన 95 రన్స్ చేసి ఔట్ అయ్యాడు…ఇక 48 ఓవర్లకే ఇండియా 6 వికెట్లు కోల్పోయి 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయంతో ఈ వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ని ఓడించే టీం లేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది…