దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది మార్చి నెల చివరి వారం నుంచి రైలు ప్రయాణాలపై ఆంక్షలు అమలైన సంగతి తెలిసిందే. మొదట్లో రైలు ప్రయాణాలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు కాగా ఆ తరువాత రైల్వే శాఖ రైలు ప్రయాణాలకు సడలింపులు ఇస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో ప్రత్యేక రైళ్ల పేరుతో పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కరోన కేసులు తగ్గిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైళ్లు అందుబాటులోకి వస్తే బాగుంటుందని రైలు ప్రయాణికులు భావిస్తున్నారు.
Also Read: ఏటీఎంను ముట్టుకోకుండా డబ్బులు విత్ డ్రా.. ఎలా అంటే..?
అయితే అతి త్వరలో పూర్తిస్థాయిలో రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే ఈ మేరకు అధికారక పకటన మాత్రం వెలువడాల్సి ఉంది. పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తే మాత్రమే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం.. రాష్ట్రపతికి మహిళ రాసిన లేఖ వైరల్..!
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల రైలు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం 65 శాతం రైళ్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు అందుబాటులో రానున్నాయని తెలుస్తోంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పరిశ్రమ వర్గాలకు చెందిన అందరి సూచనలను తీసుకొని పూర్తిస్థాయిలో రైళ్లను అందుబాటులోకి తెస్తామని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ గత నెలలో ప్రారంభమైంది. పలు రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కూడా కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.