https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపైటికెట్ బుకింగ్ ఈజీ..?

కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన తరువాత రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ల పేరుతో దశల వారీగా రైలు సర్వీసులను అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటివరకు 65 శాతం రైలు సర్వీసులు అందుబాటులోకి రాగా దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. Also Read: రూపాయి ఫీజుకే విద్య.. రిటైర్మెంట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : February 27, 2021 10:54 am
Follow us on

Indian Railway General Ticket Booking

కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన తరువాత రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ల పేరుతో దశల వారీగా రైలు సర్వీసులను అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటివరకు 65 శాతం రైలు సర్వీసులు అందుబాటులోకి రాగా దశల వారీగా రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Also Read: రూపాయి ఫీజుకే విద్య.. రిటైర్మెంట్ తర్వాత కూడా టీచింగ్ చేస్తున్న మాస్టర్..?

అయితే ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా జనరల్ టికెట్ బుకింగ్ చేసుకునే వాళ్లు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టికెట్ ను రిజర్వేషన్ చేసుకోని వాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వరకు ఆన్ లైన్ కే పరిమితమైన రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థ ఇప్పుడు అన్ని స్టేషన్లలో ఆఫ్‌లైన్లలో కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ ధరలు తగ్గేది ఎప్పుడంటే..?

అయితే ఆఫ్ లైన్ లో టికెట్ బుకింగ్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో టికెట్ కౌంటర్ల దగ్గర రద్దీ రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. దీంతో రైల్వే శాఖ మొబైల్ యాప్ సౌకర్యంపై యుటిఎస్‌ను తిరిగి ప్రారంభించినట్లుగా వెల్లడించింది. రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి రానటువంటి జోన్లలో టిక్కెట్లను బుక్కించేసుకునేందుకు కోసం మొబైల్ అప్లికేషన్ ను వినియోగించుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

యుటిఎస్ ఆన్ మొబైల్ యాప్ సౌకర్యం ద్వారా, ప్రయాణికులు సులువుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. మరోవైపు కరోనా విజృంభణ వల్ల రైల్వే శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.